ABOUT US … ( ఈ బ్లాగు గురించి … )

ABOUT US …  ( ఈ బ్లాగు గురించి … )
 
ఇది తెలుగువారికి సుపరిచితమైన “telugubhakti.com” యొక్క 
అనుబంధ బ్లాగు ( Sister – Blog ).
 
మన ప్రధాన లక్ష్యాలు నాలుగు :
 
(1) తెలుగు భాషకు సేవ :   
ఎక్కువ శాతం తెలుగువారు ఎక్కువ పరిమాణంలో  మాతృభాషను 
ఉపయోగిస్తూ, అమ్మ ఒడిలోని కమ్మదనాన్ని జీవితాంతమూ
ఆస్వాదించేందుకు దోహదం చేయడం ద్వారా మాతృభాషా –
పునరుజ్జీవనం !
 
(2) తెలుగు వారికి సేవ : 
తెలుగువారు ఎక్కడ ఉన్నా, వారికి, వారి కుటుంబాలకు తరతరాలా 
తెలుగుదనంతో అనుబంధం దృఢతరం చేసేటట్లుగా, తెలుగు 
సంస్కృతీ సాహిత్య కళాత్మక విజ్ఞాన వివేకములను 
అందించేందుకు  కృషి చేయడం !
 
(3) భక్తి యోగం :
భక్తి-ప్రధానంగా భారతీయ సనాతన జీవన విధానం, ఆధ్యాత్మిక,
(కర్మ, యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాది) సాధనా మార్గాలపై అవగాహన
పెంచేందుకు ప్రామాణిక సంస్కృతాంధ్ర గ్రంథాలను/గ్రంథ భాగాలను 
మూలం గానీ తాత్పర్యంతో గానీ అందించేందుకు కృషి చేయడం !
 
(4) పరస్పర ప్రచోదనం :
అచ్చు వేసిన పుస్తకాలకైతే  సంపాదకవర్గం, పాఠకవర్గం వేరుగా 
ఉంటుంది; గ్రంథ విస్తర భీతి ఉంటుంది. మనకు ఆ భయం లేదు. 
పాఠకులందరూ కూడ చేతనులే; ఆలోచనలు స్పందనలు 
భావనాశక్తి గలవారే. కాబట్టి,  పాఠకులందరూ విమర్శకులు, 
సంపాదకులు అయ్యే అవకాశం ఇక్కడ ఉంది.
ఆదిశంకరాచార్యులవారు శివస్తోత్రం ఒకవిధంగా చేస్తే, 
భక్త కన్నప్ప ఇంకో విధంగా చేసి ఉంటాడు; 
ఇతర జానపదులు వేరేవిధంగా చేసి ఉంటారు !
సహజత్వంతో కూడిన, వైవిధ్యభరితమైన ఈ భావవినిమయం – 
( Sharing of feelings, reactions, discussions, debates, 
Gems of Quotations and  Ideas – own or collected )
జరగడం ఎంతటి ఉత్తేజకరం ! తెలుగుభాషలో అయితే మరీనూ !
 
ప్రధానంగా ఈ అవకాశం కల్పించడానికే ఈ అనుబంధ బ్లాగు 
( Sister-Blog ) అవతరించింది. దీనిలో మీ అందరూ ఉత్సాహంతో 
పాల్గొంటారని ఆశిస్తున్నాం !
 
NOTE:
 
Various Facilities of this Blog are contained in the 
Side – Bar. If the side-bar is not visible on the 
right side of this page, please click on the Title
 ” TELUGU BHAKTI ” at the top of this page. 
Then in the side-bar that appears, you can click on
different items to view the related topics. 
 
ప్రకటనలు

50 వ్యాఖ్యలు to “ABOUT US … ( ఈ బ్లాగు గురించి … )”

 1. IragavarapuChari Says:

  అమరజీవి
  మదనా సుందర నాదొరా అంటూ
  మురిసి పరవసించిన చిత్రసీమ
  కళామతల్లి కల్కితురాయి సి నా రె
  నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని అంటూ
  తెలుగు కవితా దేవికి సుగంధ సినీగేయ
  కవితామాలికలు అర్పించిన భావకవి సి నా రె
  మనసుని మందిరంగా చేసుకుని
  అందులో కవితాదేవిని నిలుపుకుని
  పరిమళ సుగంధ భావకవితా గీతమాలికలు సమర్పించి
  కవితానీరాజనాలతో ఆనందపరవశులై
  కర్పూర కళికలా కరిగి ముక్తి నొందిన కవి సి నా రె
  ఆయన గేయ కవితామాలికలు
  తెలుగు కవితామతల్లి కంఠంలో
  ఎప్పుడూ వడలని ముత్యాలమాలలు
  అందుకే ఆయన ఎప్పటికి అమరజీవి
  వినమ్ర శ్రద్ధాంజలితో
  IragavarapuChari

 2. Iragavarapu Chari Says:

  శ్రీకృష్ణ భక్తితత్వం
  నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
  జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
  జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
  మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!
  ఈ పద్యంలో మనకు బాహ్యంగా కనిపించేది కృష్ణయ్య అందచందాలు
  అమాయక గోపికల హృదయాల్లో నల్లనయ్యమీద వుండే ప్రేమానురాగాలు పద్యంలో ఉండే భావం పైకి గోపికల ప్రణయకలాపంలా అనిపిస్తుంది కాని నిజానికి జీవాత్మ పరమాత్మల సంబంధం ఒక్కడే కృష్ణుడు చాలామంది గోపికలు
  వారంతా నల్లనయ్యను ఎందుకు వలచేరు? గోపికలకు ఈవిషయం తెలీదా? ఇవి సామాన్యంగా అందరికీ మనసులో కలిగే భావన
  కాని సదా భగవంతుని మీద అనురాగ భక్తిపరులై తమను గోపకాంతలుగా భావించుకొనే భక్తులకు ఇది ఒక మధురానుభూతి తాము భగవంతునితో మమేకమయ్యేమనే అనుభూతి భక్తి ముదిరిన మనుషులు అతిప్రేమ ఎక్కువైన మానవులు అప్పుడప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు అదేపని బృందావనంలోని గోపికలు చేసారు తాము మనసా వాచా కర్మణా అభిమానించే నల్లనయ్యని అందమైన సుకుమారుడుగా భావించారు
  అందుకే సుకుమారమైన మల్లెపూలు పూసె మల్లెపొదల దగ్గరకు పోయి
  తమ మానస చోరుడు ఎక్కడవున్నాడని అడిగారు వారు తాము నమ్ముకున్న భగవంతునికి ఆత్మనివేదనలు చేసుకున్న
  దాసాను దాసులు గోపికలు భగద్విరహంలో పరితపించే జీవాత్మలు
  వీరందరికి ఇళ్ళు వాకిళ్ళు పతులు సుతులు ఉన్నారు
  అయినా జీవాత్మలు పరమాత్మలో మమేకం కావడం ముక్తిగాభావించారు
  కర్మబంధమైన రూపం జీవాత్మకు సంబంధం కాకూడదని భావించారు
  మోహనమూర్తి మురళివాదనకు పరవశులై వెన్నెలవేళ యమునాతీరంలో నల్లనయ్యతో రాసక్రీడలు సలిపారు భగవంతుని ఆత్మనివేదన ద్వారా దాసానుదాసులై కైవల్యప్రాప్తి పొందారు
  ఇదే గోపికలు ప్రదర్శించిన రాసలీలల శ్రీకృష్ణ భక్తితత్వం
  జై శ్రీమన్నారాయణ
  Iragavarapu Chari

 3. IRAGAVARAPU CHARI Says:

  గోపికల రాసలీలలు — కృష్ణతత్వం 2
  గోపికలందరూ కృష్ణుడు చెప్పినట్లు యమునను ప్రార్ధించారు
  యమునానది దారి ఇచ్చింది అందరూ అవతల ఒడ్డుకి చేరుకుని దూర్వాసమహాముని దగ్గరకు వెళ్ళారు దండాలు మహాముని దండాలు దండాలు మేమంతా బృందావనంగోపబాలికలం కృష్ణుడు పంపగా మీదగ్గరకు వచ్చాము కృష్ణయ్య మీకోసం జున్ను వెన్న పెరుగన్నం క్షీరాన్నం పళ్ళు పంపించాడు వాటిని ఆహారంగా స్వీకరించండి స్వామి అని ప్రార్ధించారు
  వెంటనే దుర్వాసముని వారితో అయితే వాటిని నాకు తినిపించండీ అన్నారు అలాగేస్వామీ అంటూ గోపబాలికలు వారు తెచ్చిన భక్ష్యాలన్నింటిని తినిపించారు
  అనంతరం దుర్వాసముని దగ్గర సెలవు తీసుకుని తిరిగియముననది ఇవతల ఒడ్డుకి రావడానికి గోపబాలికలు బయలుదేరారు ఇంతలో ఒక గోపబాలిక తక్కిన గోపబాలికలతో యమునానదిలో మనం వచ్చిన దారి మూసుకుపోయింది ఇప్పుడుఎలా వెళతామని అడిగింది
  వెంటనే వారు దుర్వాసుని ప్రార్ధించి ఈ విషయం చెప్పారు
  అయన వారికి సంస్కృతంలో ఒక శ్లోకాన్ని చెప్పారు ఈశ్లోకాన్ని యమునానది దగ్గరకు వెళ్ళి చదివి ప్రార్ధించండి వెంటనే యమునానది మీకు దారి ఇస్తుంది అని చెప్పారు
  అయ్యా స్వాములూ మేం అమాయకులైన గోపబాలికలం మాకు చదువురాదు అని చెప్పారు
  సరే మీ పరిభాషలో చెప్తాను వినండి అమ్మా యమునానది నీకు నమస్కారం దూర్వాసమహామునులు వారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా దర్భరసాన్ని మాత్రమే స్వీకరించే వారు అయితే మేము ఆవలి గట్టుకి వెళ్ళడానికి దారి ఇయ్యి అని ప్రార్ధించమని చెప్పారు
  గోపికలు ముని చెప్పినట్లుగానే యమునానదిని ప్రార్ధించి ఇవతల గట్టు దగ్గరున్నకృష్ణుని దగ్గరకు చేరుకున్నారు
  ఆనందంతో కృష్ణయ్యకు అక్కడ జరిగినవన్నీ వివరించి పరవశించారు
  అయితే కృష్ణయ్యా మాకు రెండు సందేహాలున్నాయి అని చెప్పారు
  మొదటిది నీవు మా గోపకాంతలందరితో రాసలీలలు చేసినవాడివి కదా? నీవు బ్రహ్మచారివి ఆడదాని స్పర్శ తెలీనవాడివి ఎలా అవుతావు? ఈ విషయం చెప్పగానే యమునానది మాకు దారి ఎలా ఇచ్చింది?
  ఇక రెండవది మేము పెట్టిన భక్ష్యాలన్నీ తిన్న దుర్వాసముని ఎలాంటి ఆహారం తీసుకోని వారు ఎలా అవుతారు? ముని చెప్పినట్లుగానే మేము యమునానదిని ప్రార్ధించగానే దారి ఎలా ఇచ్చింది?
  ఇది మా మట్టి బుర్రలకు అర్ధం కావటంలేదు మా సందేహం తీర్చు అని కృష్ణయ్యని గోపకాంతలు కోరారు అప్పుడు కృష్ణయ్య నవ్వుతూ వారికి సమాధానం చెప్పాడు
  తామరాకు మీద నీటి బొట్టులా ఈ విశ్వంలో ఉంటాను. సృష్టి స్ధితి లయకారకునిగా భాసిస్తాను
  బ్రహ్మ విష్ణు పరమేశ్వర దేవతాది రూపాలన్నీ నేనె
  వేడి వెన్నెల గాలి నీరు నిప్పు వానలాంటి పంచభూతాల రూపాల్లో కనిపిస్తాను
  ఆదిత్యాది సర్వగ్రహ గతులు నేనె సర్వప్రాణకోటిలో జీవం నేను రూపం నేను
  జీవులలో ఆహారం పచనంచేసే జఠరాగ్ని నేనే
  నేనేసత్యం నేనేసర్వం నేనేధర్మం
  పశువు పక్షి ఆవు దూడ ఆడ మగ పిల్లలు పెద్దలు ముసలి అనే తేడా నాకు లేదు
  అద్దాల మండపంలో మధ్యగా నిలుచున్న మనిషి తన ప్రతిబింబాన్ని
  చుట్టూ వున్న అద్దాల్లో ఎలా చూసుకుంటాడో అలాగే నాచుట్టూవున్న నాలోని జీవుల రూపాలను చూసుకుని మురిసిపోతాను
  నిజానికి జీవాత్మ పరమాత్మ వేరుకాదు ఒకటే
  మీరంతా భక్తిపారవశ్యంతో సదా నన్నే స్మరిస్తూ నాసాంగత్య అనుభూతిని పొందినవారు
  నేనుమాత్రం మీకోరిక మేరకు అనందానుభూతిని ప్రసాదంచిన వాడిని మాత్రమే అందుకే నేనెప్పుడు ఆజన్మ బ్రహ్మచారినని కృష్ణుడు గోపికలకు వివరించాడు
  బుధ్ధి: కర్మాను సారిణి అనే వాక్యాన్ని అనుసరించి బుద్ధి పూర్వకంగా చేసిన కర్మఫలాలు శరీరాకృతి ధరిచిన రూపానికే కాని
  పరమేశ్వరునిలో మమేకమైన జీవాత్మకు సంప్రాప్తించవు
  ఆ ధర్మాన్ని అనుసరించే దూర్వాశముని మీరు అనేక భక్ష్యాలు పెట్టినా తినలేదని యమునానదికి చెప్పమన్నారు అని కృష్ణయ్య గోపికలకు విశదీకరించాడు
  ఇదంతా విన్న గోపికలు విస్మయ ఆనంద పరవశులై
  అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం
  రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం
  అంటూ శ్రీకృష్ణుని మనసారా ప్రార్ధించారు
  IRAGAVARAPU CHARI

 4. chari Says:

  గోపికల రాసలీలలు — కృష్ణతత్వం – 1

  సత్యం ధర్మం సత్ప్రవర్తన ప్రధానమని ప్రభోదించిన
  పరమాత్ముడే పరకాంతలతో రాసక్రీడలు చేయడం ధర్మం ఎలా
  అవుతుందని పరీక్షిత్ మహారాజు శుకమర్షిని ప్రశ్నిస్తారు
  అప్పుడు శుకమహర్షి పరీక్షిత్తునితో అగ్నిలో మలినాలు శుద్ధిపొందుతాయి గంగలో స్నానం చేస్తే పాపాలు కరిగిపోతాయి పరమేశ్వరుడు హాలాహలాన్ని కంఠంలో నిలుపుకున్నాడు
  అలాగే భగవంతుని లీలలు పరమాత్మ స్వరూపమైన కృష్ణయ్యకే
  తెలియాలని సమాధానమిచ్చి
  కృష్ణతత్వం రాసక్రీడలకు సంబంధించి ఒకకథను మహారాజుకి చెప్పారు
  ఒక నిండు పున్నమి రోజురాత్రి గోపికలందరూ కృష్ణయ్యతో కలసి రాసక్రీడ సలపడానికి పిండివంటలతో యమునానది ఒడ్డుకు వెళ్ళారు అక్కడ కృష్ణయ్య లేడు గోపికలు కృష్ణయ్యకోసం కొంతసేపు ఎదురుచూసారు ఇంతలో కృష్ణుడు వచ్చాడు ఇంతవరకూ ఎక్కడకు వెళ్ళావు కన్నయ్యా అంటూ గోపికలు కృష్నుని ప్రశ్నించారు నది ఆవలి ఒడ్డుకి అక్కడవున్న గురువుదగ్గరికి వెళ్ళాను అన్నాడు మాయమాటలు చెప్పకు నీవే అందరికి గురువువి కదా? అన్నారు
  ఇంతకీ ఆగురువు ఆడా మగా అన్నారు మగే ఆయన దుర్వాస మహాముని ఆయన్ని నవ్వించడానికని వెళ్ళానని చెప్పాడు కోపిష్ఠి అయిన దూర్వాస మునితో నీకు మాటలా? కట్టుకథలు చెప్పకు మేమునమ్మం అక్కడకూడా ప్రియురాల్లెవరోవున్నారు
  వాళ్ళతో రాచలీలలు చేసి వస్తున్నావు నిన్ను మేము నమ్మం
  అందుకు సాక్ష్యం ఏదైనావుందా అని గోపికలు కృష్నుని ప్రశ్నించారు
  అయితేవెళ్ళి చూసిరండి దూర్వాశమునితో మాట్లాడుతూ అక్కడవుండే పళ్ళు పదార్ధాలు తినీసాను ఇప్పుడు మీరు తెచ్చిన పదార్ధాలు అక్కడకు పట్టుకెళ్ళి మునికి ఇవ్వండి అన్నాడు కృష్ణుడు యమున దాటి ఆవలి గట్టుకి వెళ్ళాలిగా అందుకే మమ్మల్ని బుకాయిస్తున్నావ్ నీలా మాకు మాయలు రావుకదా అన్నారు గోపికలు అప్పుడు కృష్ణుడు గోపికలతో యమునా నది దాటడానికి
  ఒక మంత్రం చెబుతాను అదిమీరు యమునానది ఒడ్డు దగ్గరికి వెళ్ళి చెప్పండి వెంటనే నది మీకు దారిచ్చెస్తుందని చెప్పాడు
  దానికి సరే చెప్పు అన్నారు గోపికలు
  కృష్ణయ్య సంస్కృతంలో ఒకశ్లోకం వారికి చెప్పాడు
  ఓకృష్ణయ్యా మేము అమాయకులైన గోపబాలికలం మాకు అంతగా చదువురాదు నువ్వు చెప్పిన శ్లోకం మేము చెప్పలేమన్నారు
  సరే మీ పరిభాషలోనే చెబుతా వినండి అన్నాడు
  మీరంతా యముననది గట్టుదగ్గరకు వెళ్ళి దండం పెట్టి ఇలా చెప్పండి ఓయమునా నదీ మా కృష్ణయ్య ఏ ఆడదాన్ని తాకనివాడు బ్రహ్మచర్య దీక్ష చేసేవాడు అయితే మేమంతా అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి దారి ఇవ్వవా అని అడగండి అని చెప్పాడు
  అతని మాటలకి గోపికలంతా పకపకా నవ్వుతూ నువ్వు ఆడదాన్ని తాకనివాడివా? బ్రహ్మచారివా? అంటూ హేళన చేసారు
  సరే యమునానది మీకు దారి ఇస్తే నమ్ముతారుకదా
  మీరు ముందు అక్కడకి వెళ్ళి అడిగి చూడండి అన్నాడు
  సరే అంటూ గోపికలందరూ యముననది గట్టు దగ్గరకు బయలుదేరి వెళ్ళారు (ఇంకావుంది)

  Iragavarapu Chari

 5. IRAGAVARAPU CHARI Says:

  జ్యేష్ఠ మాసము

  తెలుగు నెలల్లో మూడవ నెల పౌర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ట నక్షత్రంతో కలిసి ఉంటాడు
  కనుక ఈనెలని జ్యేష్ఠ మాసముగా పిలుస్తారు ఈనెలంతా గ్రీష్మరుతువు వుంటుంది
  క్రీ.శ. 1896 జ్యేష్ఠ మాసములో తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము చేసారు
  ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది
  జై శ్రీమన్నారాయణ
  IRAGAVARAPU CHARI

 6. IRAGAVARAPU CHARI Says:

  కర్తరి కాలనిర్ణయం
  జ్యోతిష్యశాస్త్రప్రకారము రవి భరణి నక్షత్రం యొక్క 3 4 పాదములందు కృత్తికనక్షత్రం 1 2 3 4 పాదములందు
  రోహిణి 1పాదములో సంచరించుకాలమును కర్తరికాలముగా పండితులు నిర్ణయించారు కర్తరి కాలమునురెండు భాగాలుగా విభజించారు
  రవి భరణి నక్షత్రం 3 4 పాదములందు సంచరిచుకాలమును చిన్నకర్తరి లేక డొల్లు కర్తరి అని పిలుస్తారు
  కృత్తికనక్షత్రం 1 2 3 4 పాదములు రోహిణి మొదటిపాదమున సంచరించుకాలమును నిజకర్తరి లేక అగ్ని కర్తరి అనిపిలుస్తారు
  ఈసంవత్సరము నిజకర్తరి మే11 నుంచి 28వరకు ఉంటుంది

  IRAGAVARAPU CHARI

 7. IRAGAVARAPU CHARI Says:

  హనుమజ్జయంతి
  హనుమంతుని జననం వైశాఖ మాసం బహుళ దశమి
  ఆయన నివాసం కిష్కింధ వాయుదేవుని అనుగ్రహంవల్ల
  శివుని తేజంతో తల్లి అంజనీదేవికి జన్మించాడు తండ్రి కేసరి
  పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగినవానిగా పుట్టాడు
  సూర్య బింబాన్ని చూచి పండు అనుకొని తినడానికి వెళ్ళాడు
  అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో దవడపై కొట్టేడు
  అయన దవడ సొట్టబడింది అప్పటినుండి హనుమంతుడనే పేరు వచ్చింది అప్పుడు వాయుదేవుడు ఆగ్రహించాడు
  వెంటనే బ్రహ్మాది దేవతలు హనుమంతునికి
  అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు
  అయితే మునుల శాపంవల్ల ఆయనశక్తి యుక్తులు ఆయనకు తెలియవు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు
  సకల విద్యలలోను వ్యాకరణంలోను మహాపండితుడు అయ్యాడు
  హనుమంతుడు సీతారాములకు దాసునిగా రామ భక్తునిగా ప్రసిద్ధిపొందాడు శంకర భగవత్పాదులు హనుమత్పంచరత్న స్తోత్రము రచించి తద్వారా హనుమంతుని కీర్తిచారు
  ఈయన వైష్ణవ భక్తుడు
  ద్వైతులు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమద్ జయంతిఉపాసన
  వేడుకలను ప్రారంభిస్తారు 40రోజుల ఉపాసనలు తర్వాత
  వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు
  మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
  వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
  జై శ్రీమన్నారాయణ
  IRAGAVARAPU CHARI

 8. iragavarapu chari Says:

  నాడు — నేడు
  నాడు నాలుగు గోడలమధ్య సంసారం చేసావారు
  నేడు ఆరుబయట సంసారం సాగిస్తున్నారు
  నాడు కష్టమొస్తే బంధువులు ఆత్మీయులు ధైర్యం చెప్పి ఆదుకొనేవారు
  నేడు సుఖమొస్తే బంధువులు ఆత్మీయులు ఆతిధ్యానికి విచ్చేస్తారు
  జై శ్రీమన్నారాయణ

  CHARI

 9. IRAGAVARAPU CHARI Says:

  వైశాఖ పౌర్ణిమ
  వైశాఖ పౌర్ణిమి బుద్ధుడి జయంతిని సూచించే పర్వదినం
  అందుకే బుద్ధపౌర్ణిమని కూడా పిలుస్తారు బుద్ద పూర్ణిమ బౌద్ధులకు ముఖ్యమైనది ఈరోజున సత్యానికి సంబంధించిన అష్టాంగ మార్గాలను బోధించి బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు
  బౌద్ధ సంప్రదాయ ప్రకారము వైశాఖ పర్వదినంగా పిలుస్తుంటారు
  ఏకాగ్రతకు మనస్సు ప్రధానమైంది అలాంటి మనస్సుని నిలకడగా వుంచి సత్యాన్వేషణ చేసి జ్ఞానోదయం పొందినరోజు వైశాఖ పౌర్ణమి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిందీ నిర్వాణం పొందిందీ
  ఒకే రోజున కావడంతో ఇది బుద్దపౌర్ణిమగా ప్రసిద్ధిపొందింది
  మనస్సుకు చంద్రుడు ప్రధానకారకుడు అందుకే పౌర్ణమిరోజు పూర్ణచంద్రుని ఉపాసనచేస్తే మనస్సు నిర్మలంగా నిర్భయంగా
  వుంటుందని జ్యోతిష్కులు చెబుతారు
  గాంధీ మహాత్ముడు చంద్రోపాసన చేసినట్లు ఆయన ఆత్మకధ వల్ల తెలుస్తుంది అందుకే చాలామంది పూర్వులు కార్తీకపున్నమి,
  పుష్యపున్నమి,మాఘపున్నమి, పాల్గుణపున్నమి చైత్రపున్నమి,వైశాఖపున్నమిలకు పూర్ణచంద్రోదయం బాగాకనిపించే ప్రాతాలకు వెళ్ళి చంద్రోదయం చూడడం సాంప్రదాయంగా మారింది
  మూడు సముద్రాల కలయికగావుండే కన్యాకుమారి భారతదేశం చివర భాగమైన దక్షిణానవుంది
  క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసి తరించారు
  ఆయన ధ్యానం చేసిన ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు దానికి గుర్తుగా ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు
  అందుకే ఇప్పటికి వైశాఖ పౌర్ణమిరోజున సూర్యాస్తమయం చంద్రోదయాలు చూసి తరించడానికి దేశ,విదేశాలనుంచి
  చాలామంది భక్తులు వైశాఖపౌర్ణమి రోజున వెళతారు
  ఇక్కడ సముద్రపు ఒడ్డున కన్యాకుమారి ఆలయంవుంది ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం
  మూడు సముద్రాలైన బంగాళా ఖతము హిందూ మహా సముద్రము
  అరేబియా సముద్రము కలిసే చోట ఈ ఆలయము నిర్మించారు ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని పండితులు చెబుతారు ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈప్రాంతానికి వైశాఖ పౌర్ణమి రోజున వచ్చి చంద్రోదయం చూడడం కన్యాకుమారి దేవిని
  దర్శించడం మానవులు చేసుకున్న సుకృతం
  జై శ్రీమన్నారాయణ
  IRAGAVARAPU CHARI

 10. chari Says:

  అన్నవరం స్వామి దర్శనం ఒకయోగం
  (ఈనెల 6శనివారం స్వామి కల్యాణం)
  రత్నగిరి పర్వతసానువుల మీద ఆరంపూడి అన్నవరం గ్రామ ప్రాంతంలో సాధారణ శకం 1891 ఆగష్టు 6 వ తేదీని
  స్వామి విగ్రహప్రతిష్ట జరిగింది స్వామి వారిని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామిగా పిలుస్తారు
  స్వామివారి విగ్రహప్రతిష్టకి సంబంధిచిన ఒకకథ ప్రచారంలోవుంది
  పిఠాపురానికి దగ్గరలోని గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి జమీందారీ వ్యవస్ధలో
  అరికెంపూడి అన్నవరం అనే గ్రామంవుండేది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన మహా భక్తుడు
  ఒకనాడు శ్రీమహావిష్ణువు స్వప్నంలో వీరికి శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి
  శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై
  ఆవిర్భవిస్తాను నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవిచండి అని స్వప్నంలో చెప్పి స్వామి అంతర్ధానమైనట్లు
  స్వామి చరిత్రవల్ల తెలుస్తోంది
  తర్వాతి రోజున ఇద్దరు కలసికొని తమకు వచ్చిన కల గురించి ఒకరికి ఒకరు చెప్పుకున్నారు వెంటనే మంచి ముహూర్తమునిర్ణయించుకుని
  ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి రోజున
  అందరు అన్నవరం రత్నగిరి పర్వతసానువుల మీదకు చేరుకున్నారు అక్కడ స్వామివారి కోసం వెదుకుతుండగా ఒక కొండజెముడు చెట్టు పొదలో స్వామి విగ్రహం కనిపించింది వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపై ప్రతిష్ఠించారు
  కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రంతో విష్ణుపంచాయతన పూర్వకంగా ప్రతిష్టచేసారు ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు
  ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం అందుకే ఈస్వామిని శివ కేశవులకు అభేదమైన దేవునిగా భక్తులు కొలుస్తారు సత్యనారాయణ స్వామివారికి మీసాలు నామాలు వుంటాయి స్వామికి కుడిప్రక్కగా శివుడు ఎడంప్రక్కగా అనంతలక్ష్మి అమ్మవారి విగ్రహాలు వుంటాయి దేవాలయవ్యవస్ధ ప్రారంభమైన కొన్నాళ్ళకి శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారు
  దేవాలయంలో వేదపారాయణాదుల నిమిత్తం శ్రీపాదసుబ్రహ్మణ్యఘనాపాఠీ వారిని, కృష్ణయజుర్వేద పండితులు
  శ్రీఇరగవరపు వేంకటలక్ష్మీ నరసిం హాచార్యులు వారిని నియమించి శివ కేశవ అభేదాన్ని చాటి చెప్పారు
  మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి ప్రత్యేకత త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ చూడవచ్చు
  అందుకే ఈస్వామిని ఇలా ప్రార్ధిస్తారు
  మూలతో బ్రహ్మరూపాయ — మధ్యతశ్చ మహేశ్వరం
  అధతో విష్ణురూపాయ — త్ర్త్యెక్య రూపాయతేనమః
  ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీ సీతారాములు కొండమీద రామాలయంతోబాటు వనదుర్గమ్మ దేవాలయం
  కనక దుర్గమ్మ దేవాలయం కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉన్నాయి
  సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసేగడియారం ఇక్కడవుంది రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే ఏటా అనేక ఉత్సవాలు జరుగుతాయి
  చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది – పంచాగశ్రవణం చైత్ర శుద్ధ నవమి శ్రీ సీతారామ కళ్యాణోత్సవం
  శ్రావణ శుద్ధ విదియ – శ్రీసత్యనారాయణస్వామి జయంతి
  వైశాఖ శుద్ధ ఏకాదశి- స్వామివారి కళ్యాణం
  గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక శుద్ధ ద్వాదశి తెప్పోత్సవం కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ జ్వాలాతోరణం
  అన్ని వర్గాల వారికి వసతి వుంది ఉచిత భోజన సదుపాయంవుంది
  ఈస్వామిని దర్శించడానికి ఏడాది పొడుగునా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు
  ఈక్షేత్రం సత్యనారాయణ వ్రతానికి ప్రసిద్ధమైంది స్వామి సన్నిధిలో నిత్యం వ్రతాలు జరుగుతూనేవుంటాయి స్వామి వుండే రత్నగిరికి ఆనుకుని సంవత్సరం పొడవునా ప్రవహించే పంపానదిలో స్నానంచేసి స్వామిని దర్శించి వ్రతాదులు ఆచరించడం ఒకయోగమని స్కంధపురాణంలో వివరించబడింది

 11. Chari Says:

  బద్రీనాధ్ క్షేత్రం దర్శనం
  బద్రీనాథ్ హిందువుల పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలిజిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం
  అలకనందానదీతీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య 6,560 మీటర్లు ఎత్తులోవున్న నీలఖంఠ
  శిఖరానికి దిగువభాగంలో ఉంది బద్రీనాథ్ ఋషికేశ్‌కు
  ఉత్తరదిక్కున 301 కిలోమీటర్ల దూరంలో ఉంది వైష్ణవ 108 దివ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాలలో
  బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించబడింది
  బద్రీ అంటే రేగుపండని అర్ధం నాధ్ అంటే దేవుడని అర్ధం ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి
  బద్రీనాధుడు అనే పేరు వచ్చింది
  బద్రీనాథ్ నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం
  ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్నితప్త కుండ్ అని పిలిచే వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించారు
  16వ శతాబ్దంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించారు
  1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయపూర్ రాజుచే బద్రీనాథ్ ఆలయం పునర్నిర్మించబడింది బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో
  చేర్చి 50 అడుగులు ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు
  స్కందపురాణంలో ఈ క్షేత్ర మహత్యం చెప్పబడింది
  ద్వాపరయుగాంతమందు ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన ఉద్దవుడు రక్షింపబడ్డాడు
  అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలం ఇచట స్వామి అగ్నితప్త కుండముగా ఉన్నారు ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నాన స్నానం చెయ్యాలి
  ఇచట పెరుమాళ్లు మాత్రమే దృవమూర్తిగా ఉపస్థితమై ఉన్నారు మిగతావారు ఉత్సవమూర్తులు నైవైద్యాదులకు ఈస్వామి ఎదుట తెరవేయరు అభిషేకాదులు అన్నీ భక్తులముందే జరుగుతాయి
  ప్రతీ సంవత్సరము తులామాసం పౌర్ణమి వెళ్ళినతర్వాత వెన్న నివేదనచేసి దేవాలయ తలుపులు మూస్తారు ప్రతీ సంవత్సరము మేషమాసం ప్రారంభంలో దేవాలయ తలుపులు తెరుస్తారు
  సన్నిధికి వెనుకగల లక్ష్మీనృసింహ మందిరమున ఉడయవర్ వేదాంత దేశికన్….. మొదలగువారి సన్నిధులు ఉన్నాయి
  ఇక్కడకు 1 కి.మీ దూరములో బ్రహ్మకపాలము ఉంది
  అక్కడకు 8 కి.మీ. దూరంలో వసుదార ఉంది ఈసంవత్సరం 06/05/2017 శనివారం బదరీక్షేత్రాన్ని తెరుస్తున్నారు ప్రతీవారు బదరీ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించడం మంచిది

 12. Chari Says:

  ధర్మాత్ముడు
  వినదగు నెవ్వరుచెప్పిన
  వినినంతనె వేగపడక వివరింపదగున్
  కనికల్ల నిజము దెలిసిన
  మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
  ఎవరు ఏం చెప్పినా వినవచ్చు విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి అలా పరిశీలించి
  అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు

 13. IRAGAVARAPU CHARI Says:

  ఆణిముత్యాలు

  సత్సంగత్వే నిస్సంగత్వం
  నిస్సంగత్వే నిర్మోహత్వం
  నిర్మోహత్వే నిశ్చలతత్వం
  నిశ్చలతత్వే జీవన్ముక్తి:
  సత్ఫురుషుని సాంగత్యంవలన భవబంధములు తొలగును
  బంధములు తొలగినచో మోహములు నశించును
  మోహములు నశించగా స్ధిరమైన జ్ఞానము ఏర్పడును
  స్ధిరజ్ఞానము కలగ గానే జీవన్ముక్తి లభించును
  –శ్రీశంకరాచార్య
  IRAGAVARAPU CHARI

 14. CHARI IRAGAVARAPU Says:

  సర్వవేదసారం హరియని,సర్వ దేవతల రూపం హరియని,
  సర్వ మానవాళి నామస్మరణం హరియని
  సర్వ మత కులాల భేదం లేనిది హరిరూపమని
  సర్వజనులకు ముక్తిమార్గం నారాయణమంత్రమని
  ఎలుగెత్తి చాటిన విశిష్టాద్వైత సిద్ధాంతి
  భగవద్రామానుజులకు అభివాదములు
  (నేడు శ్రీభగవద్రామానుజుల జయంతి)
  జై శ్రీమన్నారాయణ
  చారి

 15. IRAGAVARAPU CHARI Says:

  పర సంప్రదాయ గాలికి రెపరెపలాడుతున్న
  హిందూ ఆర్ష సంప్రదాయ జ్యోతికి
  తన రెండు చేతులు అడ్డంపెట్టి
  పరిరక్షించిన అపరశంకర అవతారమూర్తి
  ఆదిశంకరులకు అభివాదములు
  (నేడు ఆదిశంకరుల జయంతి)

 16. IRAGAVARAPU CHARI Says:

  అక్షయతృతీయ — పరమార్ధం
  వైశాఖ శుద్ధ తదియని అక్షయతృతీయ అని పిలుస్తారు
  అక్షయ తృతీయ’ లో ‘అక్షయ’ అనే పదము ఎప్పుడూ క్షీణించనిది అని అర్థం.తిధులలో తదియని తృతీయ అంటారు ఈ రెండు కలిపి అక్షయతృతీయగా రూపాంతరం చెందింది ఈరోజున మూడు ముఖ్యమైన విషయాలవల్ల వైశాఖశుద్ధ తదియకి అక్షయతృతీయ
  అనేపేరు వచ్చినట్లు పౌరాణిక గ్రంధాలవల్ల తేలుస్తోంది అందులో మొదటిది శ్రీమహావిష్ణువు వైశాఖ శుద్ధ తదియనాడు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రూపంలో అవతరించి ప్రహ్లాదుని అనుగ్రహించినట్లు పురాణాలవల్ల తేలుస్తోంది రెండవది శ్రీమహావిష్ణువు పరశురాముడుగా భూమిపై జన్మించిన రోజు మూడవది బలరాముడు జన్మించిన రోజు
  అందుకే అక్షయతృతీయనాడుబలరామజయంతి
  పరసురామజయంతిని నిర్వహిస్తారు.
  సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి చందనోత్సవము జరుపుతారు ఇలా ఎన్నో పౌరాణిక గాధలు ఈ అక్షయతృతీయకి ఉన్నాయి అక్షయ తృతియ రోజున మంచిమనసుతో తలపెట్టిన ప్రతీపని నిర్విఘ్నంగా జరుగుతుందని హిందువుల నమ్మకం
  ఈరోజు ఏమికొనక్కరలేదు. పదిమందికి ఉన్నదాంట్లో దానంచేస్తేచాలు ఆపుణ్యం రెట్టింపు అవుతుంది అందుకే ఈ రోజున మామిడిపళ్ళు,విసనకర్రలు,గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం
  జై శ్రీమన్నారాయణ
  IRAGAVARAPU CHARI

 17. Ch Sairutvik Says:

  Dear Sai Devotees

  I have recently launched a new blog in telugu language named Sri Shirdi Sai Gyanna mrutham. This blog containes so many ideas on our beloved Shirdi Sai. The same can be reached at http://chsairutvik.blogspot.com

  Request you to read the same and bless me.

 18. vasudeva Says:

  chala bagundi

 19. SAI NAGESH BABU V Says:

  kindly register my name/ my email account to your blog, My emaiiid is nageshbabuvs@yahoo.co.in
  please confirm.

  Thanking you

 20. chiru Says:

  I read about the Lakshman Rekha of Telugu Bhakti.com : “…….. …. ….. … … …. posts connected with cinemas, dramas, contemporary social novels, stories, TV Plays, political posts etc. are a clear no no. Some telugu friends will say these constitute culture, but we respectfully excuse ourselves.”

  However, telugunow.com is writing comments etc. in bhakti. We thought that telugunow.com web site is also having content of Bhakti only….

  Whereas, when we clicked on telugunow.com, then that web site content is displaying Hot Photos, Movie Actresses, Politicians etc….

  Now pl. think over whether displaying of telugunow.com name is complies with ‘Lakshman Rekha’ i.e., Objectives of Bhakti.com or not…

 21. chittavajula perisastry Says:

  I am very much grateful to see the site particularly regarding to bhakti articles. I want to be one of the active participants in pooja, havana etc topics to share my views from time to time

 22. chittavajula perisastry Says:

  I am very much pleased to gothrough the site and wish to be on of the member of satsang. I further request you to kindlly send all the information of bhakti articles and messages to me. regards.

 23. sp.suresh kumar Says:

  aatma namaste
  gudiki anduku vellai ane seershika chaala bagundhi.
  meeku maa danyavadhamulu.

 24. telugunow.com Says:

  * నవగ్రహములు శాంతి పూజలు దానముల వివరములు
  * కుజగ్రహ దోషము దాని ప్రభావము
  * ది 04 – 01 – 2011 వ తేది.అమావాస్య మంగళవారము ఖండగ్రాస సూర్యగ్రహణం
  * ఏలినాటి శని – ప్రభావము – పరిహారము
  * Tirumala Tirupati Sri Venkateswara Swami Varu
  * పుట్టుమచ్చలు-ఫలితాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..?
  * వేమన పధ్యాలు
  * దివినున్న కైలాసాన్ని తలపించే “మధ్యకైలాష్”
  * యేసు అదృశ్యరూపాన్ని ప్రదర్శించే “రూపాంతరాలయం”
  * సర్వమతాల సంస్కృతీ ప్రతీక “కడప అమీన్ పీర్ దర్గా”
  * ముగ్ధ మనోహర బాలగోపాలుడి ఆలయం “గురువాయూర్”
  * శ్రీ వేంకటేశ సుప్రభాతం
  * పుట్టపర్తి సత్యసాయి వాక్కులు
  * కాశీకి ప్రతిరూపమైన ప్రతికాశి….
  * ప్రత్యక్ష దైవానికి మరో విడిది “ద్వారకా తిరుమల”
  * కేతు మహాదశ అంతర్దశలు శాంతి పూజలు
  * శుక్ర మహాదశ అంతర్దశలు శాంతి పూజలు
  * శని మహాదశ అంతర్దశలు శాంతి పూజలు
  * రాహు మహాదశ అంతర్దశలు శాంతి పూజలు
  * గురు మహాదశ లో నవగ్రహ దోషముల నవారణ

 25. telugunow.com Says:

  ఏలినాటి శని – ప్రభావము – పరిహారము

 26. telugunow.com Says:

  మీ జాతకానికి సంభందించిన వివరాలు తెలుసుకోండి!
  వాస్తు దోషాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా!?
  వారఫలాలు

 27. srinivas Says:

  ఈ బ్లాగు చాలా ఉపయోగకరము .ముఖ్యంగా దేశాన్తరములలోని తెలుగువారికిది వర ప్రసాదము

  శ్రీనివాస్ నేమాని

 28. srinivas Says:

  ఈ సైట్ చాలా బాగుంది…

 29. srinivas Says:

  ఈ సైట్ చాలా బాగుంది…

  శ్రీనివాస్ నేమాని

 30. telugunow.com Says:

  మీ జాతకానికి సంభందించిన వివరాలు తెలుసుకోండి!
  ఏలినాటి శని – ప్రభావము – పరిహారము

  @ telugunow.com

 31. Dr.vuppunuthula muralidhar reddy. Says:

  Dear friends, Greetings with good wishes,
  It is a real pleasure & honour to inform you that we wish to extend our sincere good wishes to you for the initiation of thelugu bhakthi wordpress.com.
  We are very much pleased and look forward to work closely with you to advance the cause thelugu sanskruthi.
  We need healing touch of spirituality in our walk of life in this world to love our fellowmen,toshare their sufferings and to engage in true service . With kind regards
  Dr.Reddy M Vuppunuthula
  seychelles.
  00248523531.

  • telugubhakti Says:

   Dear Dr.Reddy M Vuppunuthula garu, Namaste !
   ప్రోత్సాహకరంగా ఉన్న మీ రెండు వ్యాఖ్యలను చూసి, చాలా సంతోషము. మీయొక్క సహాయ సహకారములు ఎంతో అవసరం
   (౧) మీరు N.R.I. అని తెఅనేవిస్తోంది. కాబట్టి, సాధారణంగా NRIల సాధక – బాధకాలు, (ముఖ్యంగా తెలుగు – భక్తి – ఆధ్యాత్మిక – సాంస్కృతిక రంగాలలో ) ఎలా ఉంటాయి; వారి NEEDS for Indian Cultural Knowledge ఏమిటి??అనే విషయాలు వ్రాస్తే, అవగాహన ఉన్న సభ్యులనుంచీ సమాచారం పొందవచ్చు.
   (౨) మీకు పై రంగాలు కొన్నింటిలో పరిశీలన, అనుభవం ఉంటే, Articlesని contribute చేయగలిస్తే, ఇంకా సంతోషం !
   (౩) తెలుగు లిపిలో వ్రాయటంలో మీకు ఆసక్తి, ఆనందం ఉంటే, ఇదే బ్లాగు యొక్కside-barలో ఉన్న, How to type in Telugu Script? అనే పేజీ ఉపయోగ పడగలదు. ధన్యవాదములు !

 32. Dr.vuppunuthula muralidhar reddy. Says:

  DEAR ALL,

  WE WISH YOU and your UDDESHAM to enlighten our SANSKRUTHI for the bright future and happiness to instil the unity as divinity.
  As SUN marching, so it is full of energy.we should stand on our feet and move on,that is march on and march on to succeed our goal.
  ARISE AND AWAKE THE SPIRIT OF UNITY IN US TO ENJOY THE TOTAL PEACE IN OUR LIFE WITH TELUGU BHAKTI SATSANG..
  Wishing you success,good health,happiness & prosperity.
  With Greetings and Kind Regards.

  Dr .VUPPUNUTHULA MURALIDHAR REDDY, SEYCHELLES
  Tel;+248 716337/ 523531.

 33. K B KALYANI Says:

  please add me as a member

 34. telugubhakti Says:

  To Sri MVR M, Namaste!
  If any interested persons furnish, through these columns, their address and Phone Number, it will be viewed by other like-minded persons. Then people in the vicinity / approachability can first contact each other by phone; then physically for more beneficial interaction, and contribution to the Community also.
  మరియొక ముఖ్యమైన సంగతి : ఈ బ్లాగులో వీలైనంత తరచుగా క్రొత్త క్రొత్త జాబులను (Posts) ప్రచురిస్తూ ఉంటాము. వాటి వివరాలు ఇదే పేజీలోని right side-bar లోని ” ఇటీవలి జాబులు ” అనే శీర్షిక క్రింద కనిపిస్తాయి. మనం క్రిందటిసారి ఎంతవరకు చూశామో, ఆ తరువాతి జాబులన్నిటినీ చదువుకొన వచ్చును. దీనికోసం, ఈ బ్లాగును ” Favourites ” లో పెట్టి ఉంచుకుని, ప్రతి వారాంతం లోను (during the week-ends) చూసే అలవాటు చేసుకోవటం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా సూచన.
  ఇందులోంచి మీ పిల్లలకు అందించ దగిన భావజాలం కూడా మీకు లభ్యమౌతుంది.

 35. MVR M Says:

  Kindly add my name to this site and post all relevent mails.

  Thanks.

  MVR

 36. krishnarao Says:

  It is novel and wonderful approach.
  many many thanks
  krishnarao

 37. A.Ayyappa Sastry Says:

  Ayya Namaskaramu,
  E blog chala bagundi. Nenu Retired lecturer ni,mariyu senior citizen
  varganiki chendinavadini. Naku Adyatmika mariyu yoga visayamulandu asakti. Nannu mana satsangamunandu sabuniga cherchukoni naku itara
  sabyulanu E-mail Dwara pariceyamu cheyagalandulaku koruchunnanu. ippudu na vayassu 74 yrs.Na purti vivaramulu E diguvana isthunnanu
  Na Peru……ADIRAJU AYYAPPA SASTRY M.Sc,M.Ed
  phone number….040–32506539 Na cell number: 9292657147
  Na Address: Hno 4-118/$/A, Swaroop nagar,UPPAL,
  HYDRABAD 500039
  itlu Mee mitrudu
  Sd/sastry

 38. telugubhakti Says:

  తెలుగు ( మాతృ ) భాషాభిమానులు, భక్తులు చాలామంది వారి అభిప్రాయములు తెలియజేస్తూ ” నన్ను సభ్యునిగా చేర్చుకోండి ” అని అడుగుతున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒక సూచన. ఈ భావజాలం ఉన్నవారు అందరూ మన సభ్యులే. సభ్యత్వ రుసుము అంటూ వేరే ఏమీ లేదు.
  మనవారు ఎవరైనా సరే, తెలుగులో టైపుచేసిన అంశం / articles on our related topics ఇ-మెయిల్ ద్వారా మాకు పంపిస్తే, edit చేసి, సంతోషంగా ప్రచురించగలము. తద్ద్వారా, అధిక సంఖ్యాకంగా తెలుగువారి మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక భావ వినిమయం జరిగే అవకాశాలు పెరుగుతాయి.
  అలాగే ఔత్సాహికులు తమ చిరునామాను, ఫోను నంబరును వ్రాస్తే ( ఇంగ్లీషులోనైనా పరవాలేదు ) ఆ ప్రాంతానికి దగ్గరలోనున్న మిత్రులు ఒకరికొకరు
  communicate చేసుకోవటం, వీలయితె, సమావేశమవటానికి కూడ ఈ బ్లాగు వేదికగ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము..

 39. telugubhakti Says:

  శ్రీ పద్మనాభ రాజు గారికి, నమస్తే !
  అబూ ధాబి లో ఉంటున్న మీరు ఎంతో ఆసక్తితో వ్రాసిన వ్యాఖ్యకు సంతోషం.
  Please click on the title ” telugu Bhakti “at the top of this Post. Then side-bar will be visible. Please click on the topic ” How to type in Telugu Script?” appearing under the title ఇటీవలి జాబులు in the right side-bar.
  ఇది నేర్చుకున్నాక, మీరు తెలుగులో వ్రాసే articlesని ఇదే బ్లాగులో ప్రచురించాలని మా ఆశ !

  శుభాకాంక్షలతో,

 40. K.V.Padmanabha Raju Says:

  I don’t have telugu font on my PC otherwise I could have written my comment in Telugu. Anyway, I am one among them who likes to read devotional and spiritual articles in Telugu. It gives me a sense of closeness. I am extremely happy when I saw this sisiter-blog. Let us continue this blog with variety of article extrated from Vedas and Ashta Dasa Puranas in simple terms to reach larger mass.

  Sri Sivayah Gurave Namah,
  K.V.P.Raju
  Abu Dhabi

 41. krishnamurthi Says:

  kindly add my name in the list

 42. A.Ayyappa Sastry Says:

  AYYA,
  E blog chala bagundi. Nannu sabuni ga sweekarinchi Naaku Thappa
  E blog ku sambandinchina Anni Vishayamulu eppatikappuduTappaka
  pampagalndulaku Koruchunnanu
  itlu
  Mee mitrudu
  Sasthry

 43. ramamurthy shreedhara Says:

  please keep me informed always

 44. Morapakula Sridhar Sekhar Sudheer Goud Says:

  Ee Blog Saduddesyamulannintiki “Tadhaasthu”. Teluguvaarandariki Athi Twaralo Suparichitamayye vidham gaa Ee Blog Edagaalani Naa Aakaanksha. Prati Okka Teluguvaniki Edo Oka Vidham Gaa Upayogapade Vishayaalanninti Bhandaagaramgaa Roopu Diddukovaalani Akaankshisthoo….

 45. please keep me informed Says:

  chala manchi uddesam
  sastry&family

 46. KRISHNAMACHARY Says:

  ఈ బ్లాగు చాలా ఉపయోగకరము .ముఖ్యంగా దేశాన్తరములలోని తెలుగువారికిది వర ప్రసాదము

 47. vmanikyarao Says:

  I WANT TO BE MEMBER TO BENEFIT FROM SATSANG

 48. vmanikyarao Says:

  jai gurudev

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s