‘సాధన’ టాగుతో ఉన్న టపాలు

తీర్థయాత్రలు: (అత్యధిక ప్రయోజనం పొందటం ఎలా?)

28/06/2010
 
తీర్థయాత్రలు: (అత్యధిక ప్రయోజనం పొందటం ఎలా?)
 
 
సామాజిక రంగంలో ఉద్యోగమేళాలు, ఋణమేళాలు, 
ఆరోగ్యమేళాలు, మొ. ఎన్నో రకాల మేళాలు (Fairs) సందడిగా
నిర్వహించ బడుతుంటాయి గదా. 
 
వాటివల్ల వ్యక్తిగతంగా లబ్ధి పొందినప్పుడే గదా 
వాటిలో పాల్గొనటం వల్ల ప్రయోజనం ! లేకపోతే 
మనం చూసే అనేక తమాషాలలో అవీ కొన్ని అవుతాయి.
 
ఆ మేళాకు వెళ్ళిరావటం వలన, మనకు ఉద్యోగమో, ఋణమో
రాకపోయినప్పటికీ, కనీసం ఏయే అర్హతలు, ఏయే పత్రాలు
సిద్ధం చేసుకుంటే, భవిష్యత్తులోనైనా మనకు వాటిని పొందే 
అవకాశం పెరుగుతుందో తెలియవస్తుంది. కనీసం ఆ ప్రయోజనం 
దక్కించుకున్నా కూడా, వారు వివేకుల క్రిందే లెక్క !
 
ఆ మేళాల ( Fairs ) లో పాల్గొనకుండా కూడా, అంతకంటే
ఎక్కువ ( ఆరోగ్యాది ) లాభాలను పొందవచ్చు 
 
ఆధ్యాత్మిక రంగంలో – కుంభమేళాలు, తిరునాళ్ళు, 
తీర్థయాత్రలు మొ. కూడా అంతే గదా ! 
 
వాటివల్ల వ్యక్తిగతంగా మనం (ఆధ్యాత్మిక) లబ్ధి పొందితేనే గదా
వాటిలో పాల్గొనటంవల్ల ప్రయోజనం ! లేకపోతే, ఆయా 
నదులలో ఈదే చేపలకన్న, ఆయా క్షేత్రాలలో ఎగిరే పక్షులకంటే 
ఏ విధంగా మనం ఉన్నతులం? వ్యయ ప్రయాసలకోర్చ
అందిపుచ్చుకున్న సువర్ణావకాశాన్ని జారవిడుచుకున్న
అవివేకులం కాదా?
 
ఆ తిరునాళ్ళు మొ. వాటిలో పాల్గొనకుండా కూడా
అంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక ఉన్నతి సాధించే వీలు
ఉన్నది గదా !
 
కాబట్టి చెప్పవచ్చినదేమంటే – తీర్థయాత్రలు, మొ. మానమని
కాదు; మన ఇష్ట దైవానికి సంబంధించిన ఏదైనా ఒకటో రెండో
సిద్ధక్షేత్రాలను అప్పుడప్పుడు దర్శించి, ఆ దైవంతో అనుసంధానం
పెంచుకోవటం కోసమే చెయ్యాలి. మహా పురుషుల చరిత్రలను
పరిశీలిస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్క దైవానికి, ఒక్కొక్క క్షేత్రానికి 
అంకితమయ్యారని, అలా అవటం వల్లనే ప్రసిద్ధి, సిద్ధి పొందారనీ 
అనిపిస్తుంది. 
 
మోక్షసాధన వరకు ఉపయోగపడగలది యోగం. కాని, ఆధునిక 
పద్ధతులలో యోగా చేయటం ద్వారా, మనకి 
just breathing – exercises యొక్క ఫలం మాత్రమే
దక్కుతోంది !
 
అలాగే, మోక్షసాధన వరకు ఉపయోగపడగల ” తీర్థాటనము”ను
ఆధునిక పద్ధతులలో చేయటం వలన, just Tourism యొక్క
ఫలం మాత్రమే వచ్చే దక్కుతోంది గదా !
 
భౌతికంగా పెరిగిన ప్రయాణాది సౌకర్యాలను వాడుకోవద్దని కాదు;
మన మానసిక శక్తులను – వింతలు, విశేషాలు, మొ. అనవసర
విషయ బాహుళ్యం మీదికి చేదిరిపోనీయకుండా -
భగవంతునితో మానసిక అనుబంధాన్ని దృఢపరచుకునే
దృక్పథంతోనే తీర్థయాత్రలను చేస్తే, ఎంత అద్భుత ఫలితం !
 
పల్లెటూళ్ళో ఉన్న తాతగారు, బామ్మలు – తమను చూడటానికి 
ఏ అమెరికానుంచో వచ్చిన మనుమలూ, మనుమరాళ్ళూ -
తమకోసం తెచ్చినవి చూసి మాత్రమే సంతోషిస్తారా?
వారికి తమపట్ల ఉన్న అభిమానం, ఆత్మీయత, శ్రద్ధాభక్తులు,
మొ. వాటిని చూసి, అంతకన్న ఎక్కువ సంతోషించరా ?
భౌతిక విషయ ప్రపంచంలో వారు ఎంత పైకెదిగినా,
తాము చూపిన సంప్రదాయ మార్గాన్ని వదిలిపెట్ట లేదుకదా?
విలువలకు కట్టుబడి ఉంటున్నారు కదా? మొ. విషయాలు
వారికి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయా, ఇవ్వవా?
 
అవియే భగవంతుడు మననుంచి కోరుకునేది !
 

ప్రతివారు పాటింవలసిన నియమములు

26/04/2010

నేను ఈరోజు నుండి ఈక్రింది నియమములు పాటించ దల్చుకున్నాను
1. ఎవరైనా నాతో మొరటుగా మాట్లాడినా,అసహనముగా గాని,నిర్దయగాగాని
ప్రవర్తించినా, అదే విధముగా ప్రత్యుత్తరము ఇవ్వను.
2.ఎవరైనా నాతో మొరటుగా గాని,సహనము లేకగాని,నిర్దయతో గాని ప్రవర్తించినా
నేను సమాధానము ఇవ్వను.నేను అట్టి వ్యక్తిని కటాక్షించమని కోరుతాను.
3. నేను జాగ్రత్తగా పనికిరాని మాటలను వ్యాప్తి చెందకుండా నా మాటలను ఎంచు
కుంటాను.
4.నేను ఇతరుల భారము పంచుకునేటందుకు మార్గములు వెదుకుతాను.
5.నేను నా దోవలో ఎదురుతగిలే బాధలు గాని,దెబ్బలు కాని లెక్క చేయను.
6.నేను ఈరోజు ఇతరులకు తెలియకుండా ఎవరికో ఒకరికి సహాయము చేస్తాను.
7. ఇతరులు నాతో ఏవిధముగా ప్రవర్తించాలనుకుంటానో,నేను ఇతరులతో ఆ విధముగానే
ప్రవర్తిస్తాను.
8. నేను ఎవరైనా నిరాశా నిస్పృహల తో ఉన్నవానిని నా చిరునవ్వుతో,నా మాటలతో
ఉల్లాసం,ఉత్తేజ పరిచేటందుకు ప్రయత్నిస్తాను
9. నేను ఈరోజు నా శరీరముగూర్చిజాగ్రత్త తీసుకుంటాను.నేనుఆరోగ్యకరమైన
ఆహారమును అతి తక్కువగా తీసుకుంటాను.
10.నేను ఈరోజు ఆధ్యాత్మికముగా ఎదుగుతాను.నేను ఈరోజు ఎక్కువసేపు
ప్రార్ధనలో గడుపుతాను. ఆధ్యాత్మికము,మనసును ఉత్తేజపరిచే పుస్తకములు
చదివేందుకు మొదలు పెడతాను.నిశ్సబ్ద ప్రదేశములోభగవంతుని స్మరిస్తాను.


Follow

Get every new post delivered to your Inbox.