‘తెలుగు భాషా ప్రాచుర్యం’ టాగుతో ఉన్న టపాలు

How to type in Telugu Script?

10/06/2010
Sree Rama.            
                   
తెలుగులో తేలికగా వ్రాయడం (కంప్యూటర్ లో) టైపు చేయడం ఎలా?  
                   
SUGGESTIONS from           
                   
  ” kamthasthabharathi.wordpress.com “    
                   
for Promoting easy use of Indian Languages     
  ( Telugu & Sanskrit / Hindi ) on Computers.    
                   
STEPS to be able to  TYPE in INDIAN LANGUAGES -   
                   
  especially TELUGU and SANSKRIT / HINDI.    
  on the usual key-board.        
                   
  SAMPLE SCRIPTS :          
                   
Telugu:              
    శ్రీరామ జయ రామ జయ జయ రామ !      
Sanskrit:              
    श्रीराम जय राम जय जय राम !      
English:              
    SrIrAma jaya rAma jaya jaya rAma !    
                   
                   
1) For enabling the Typing of Text in TELUGU, SANSKRIT 
  (or any Indian Language)        
                   
  THE FOLLOWING  IS ONE – TIME  SET-UP.  
                   
  i open ” baraha.com “        
  ii click ” download ” on left side.      
  iii click ” download  Baraha Unicode 3.1 “    
  iv Save Baraha IME on Desk-Top.      
  v Click on the above icon and run ” IME Set – up “.  
  vi Once this is set-up, you can see the icons     
    ” Baraha IME ” , and ” Baraha Pad ” on desk top.  
                   
2) For typing Telugu, etc. whenever required.    
                   
  i click on the icon ” Baraha IME ” on desk top.  
  ii You will see at right hand bottom side     
    ( on the Start menu line, right-side )      
    the default  icon ” KN “         
    ( showing the default Language Kannada ).    
  iii  click on this . It opens a box.      
  iv  click on ” Language ” in the box.      
  v click on ” Telugu ” in the new box that shows  
     list of Indian Languages.        
    The icon will appear as ” TE ” indicating     
    Telugu Mode.          
  vi Now it is ready to type in Telugu.      
  vii press ” F11″ key or “F12″ key of the key-board,  
     to alternate between Telugu Script     
    and English Scripts any number of times.    
                   
3) For familiarity of keying-in in Telugu etc.    
  ( The SIMPLEST- EVER Method )      
                   
  i For the rules of transliteration, click on ” TE “   
    or ” EN ” at the right bottom-side. Then on     
    ” Help ” in the box. Then , double-click on     
    ” Transliteration Rules “, – then on the required   
    Language ” Telugu “, for the rules of Typing.  
                   
4) How to give the Text of , say, a Sloka, in all the   
  three languages – Telugu, Sanskrit ( Hindi is same ),   
  and English – for the benefit of readers.    
                   
  i click on the icon “Baraha Pad” on the DeskTop.  
  ii click on “Language”  -  then, on “Telugu.”    
  iii Now type the Text according to Telugu     
    Transliteration Rules. Telugu Script will appear   
    on the Baraha Pad.          
  iv  Select, copy and paste ( the text which is required 
    to be converted ) , twice below the Telugu Text.  
  v Select the second Telugu Text – click on  “Tools “   
    at the top – then on ” convert” – then on the language 
    ” Devanagari ” ( for Sanskrit & Hindi same )  
  vi Select the third Telugu Text – click on “Tools ” at the
     top – then on ” convert” – then on the language   
     English  .            
  vii Now, the first Sloka is in Telugu, the second is in   
    Sanskrit / Hindi, and the third is in English !    
  viii Most of the  Indians on Earth can read this     
    combination, pronouncingmost precisely     
    and most meaningfully !        
                   
Let most of the”TELUGU BHAKTI.COM” GROUP MEMBERS 
  enjoy typing in Telugu, and reading in Telugu the  
  original Telugu and Sanskrit Texts most accurately   
  ( without distortions ), express their meanings   
  and summaries in Telugu freely,       
  for  maximum absorption of the Rasa & Spirit !  
                   
LET US show our BHAKTI to our TELUGU !    
                   
NOTE :               
    In case of any difficulty at any stage, we shall be   
    happy to clarify further, on your query at the box   
    provided at the bottom of this post, or through  
    e-mail to ” sreemaathaa@yahoo.com”.    
                   
    తెలుగువారు తెలుగువారితో చేసే విషయ ప్రసారాలలో   
    (computer communications)లో తెలుగు లిపి యొక్క  
    వాడకాన్ని ప్రోత్సహించడం కూడా మన ప్రధాన    
    ఆశయాలలో ఒకటి కాబట్టి !        
                   

తెలుగు వల్ల మనకేం లాభం ?

21/02/2010
 
 
తెలుగువారిలోని  మేథావులారా !
 
” యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః ” అని గీతా వచనం.
 
మీరు ఆలోచించి, ఆచరణయోగ్యమని చేప్పిన విషయాలను,
 
ఆచరణలో పెట్టేందుకు స్వయంగా ప్రయత్నిస్తూ దారి చూపితే,
 
ఇతరులు అనుసరిస్తారు.
 
నేడు 21-02-2010 ” మాతృభాషా దినోత్సవం ” !
 
మన తెలుగు జాతి ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది !
 
తెలుగు సంస్కృతీ సాహిత్యాలంటే  అసలు గౌరవమే లేని ;
 
తెలుగు సంస్కృతీ సాహిత్యాలతో అసలు పరిచయమే లేని;
 
తెలుగు పలుకులు  మాట్లాడటమే ఇష్టం లేని, చేతకాని ;
 
తెలుగు అక్షరాలు వ్రాయడం, చదవడమే రానటువంటి ;
 
” తెలుగు కుటుంబాలు “ వేగంగా పెరిగిపోతున్నాయి !
 
ఎదుటివారు తెలుగువారే అయినాసరే, తెలుగు తప్ప
 
ఇంకేదయినా మాట్లాడే ” పరభాషా వ్యామోహం ” మన సొత్తు !
 
ఎప్పుడైనా ఎక్కడైనా ఓ తెలుగు తేజం తళుకులీనితే, అప్పుడు
 
” మనం కూడ తెలుగువారమే” అనే స్పృహ  తెచ్చుకుంటూండే
 
నిద్రాణ జాతి మనది.
 
ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులందరూ చెబుతున్నదేమంటే -
 
” మాతృభాషతో సాన్నిహిత్యం ఉన్నవారే ఏ భాషలోనైనా,
 
ఏ రంగంలోనైనా రాణించ గలరు ” అని ! దీనికి తార్కాణం -
 
టంగుటూరి ప్రకాశం పంతులుగారి వంటి స్వాతంత్ర్య కాలం నాటి 
 
మన న్యాయవాదులు, రాజకీయవాదులే !
 
దేశస్వాతంత్ర్యానంతరం గత 60 సంవత్సరాలలో, 
 
మారుతున్న దేశ కాల పరిస్థితులకు స్పందనగా, ఇంగ్లీషుని
 
స్వంతం చేసుకునే ఆరాటంలో,  అవసరం లేకపోయినా
 
తెలుగుకు దూరం అయ్యారు రెండు తరాల తెలుగువారు !
 
ఈ మూడో తరానికైనా,  మన ప్రధాన భాషా సంస్కృతీ స్రవంతితో
 
అనుబంధం పెంచకపోతే, పూడ్చలేని నష్టం కలిగించినవార మవుతాం .
 
మాతృ నౌకతో అనుబంధాన్నిచ్చే జీవనసూత్రం
 
( Life – chord from Mother – Space Ship )
 
తెగిపోయిన వ్యోమగామిలాగా అయిపోతుంది మన స్థితి !
 
ఎవరినో ఉద్ధరించడం దాకా ఎందుకు ? ఈ పోటీ ప్రపంచంలో -
 
పరభాషా మాధ్యమంలో నేర్చుకున్న విద్యా విజ్ఞానాలవల్ల
 
యాంత్రికమైన ఆలోచనలు, యాంత్రికమైన ఉచ్చారణలు గల
 
నేటి పోటీ ప్రపంచంలో-  మాతృభాషతో సాన్నిహిత్యంవల్ల ఏ కొంతయినా
 
పెరిగే మౌలిక, స్వీయ, సృజనాత్మక ఆలోచనలవల్ల -
 
ఏ రంగంలోనైనా ” సాటివారిలో మేటివారుగా ” గుర్తింపు తప్పనిసరి !
 
” మంచిది అని గుర్తిస్తే, మనం చేయలేకపోయినా, పిల్లలచేత చేయించవచ్చు ! “
 
వరదలలో కొట్టుకు పోతున్నవారు ఏదో ఒక ఆధారంకోసం
 
ప్రయత్నించినట్లుగా, ఏటికి ఎదురీదినట్లుగా, మనం ప్రయత్నం
 
ఆరంభించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాదు కాదు; తరుణం మించిపోతోంది !
 
ఎవరికి వారు తమ కుటూంబంలొని ప్రస్తుత పరిస్థితిని
 
ఒక్క వీసమైనా మెరుగు పర్చేందుకు తాముగా చేయదగ్గ ,
 
చేయదల్చుకున్న ఒక్క పనినైనా, ఈ టపాకు వ్యాఖ్య రూపంలో
 
అందిస్తే, అది ఇతరులకు ప్రోత్సాహకరంగానూ, మార్గదర్శకంగానూ
 
ఉంటుందనే సూచనను ఆర్తితో చేస్తున్నాను.
 
భవదీయుడు,
 
భాగవతుల శ్రీనివాస రావు

(తెలుగు భారతి . వర్డ్ ప్రెస్.కామ్ వారి సౌజన్యంతో )

( courtesy : telugubharathi.wordpress.com )

 
E-Mail :  sreemaathaa@yahoo.com
 
Blog :  kamthasthabharathi.wordpress.com
 

ABOUT US ..( ఈ బ్లాగు గురించి .. )

20/02/2010
 
 
శ్రీరామ
 
ABOUT US ..( ఈ బ్లాగు గురించి .. )
 
ఇది తెలుగువారికి సుపరిచితమైన
telugubhakti.com  యొక్క  అనుబంధ బ్లాగు.
( Sister – Blog ).
 
మన ప్రధాన లక్ష్యాలు నాలుగు :
 
(1):
తెలుగు భాషకు సేవ :
ఎక్కువ శాతం తెలుగువారు ఎక్కువ పరిమాణంలో
మాతృభాషను ఉపయోగిస్తూ, అమ్మ ఒడిలోని కమ్మ
దనాన్ని జీవితాంతమూ ఆస్వాదించేందుకు దోహదం
చేయడం ద్వారా మాతృభాషా పునరుజ్జీవనమునకై
కృషి చేయడం !
 
(2) :
తెలుగు వారికి సేవ :
తెలుగువారు ఎక్కడ ఉన్నా, వారికి, వారి కుటుంబాలకు
తరతరాలా తెలుగుదనంతో అనుబంధం దృఢతరం
చేసేటట్లుగా, తెలుగు సంస్కృతీ సాహిత్య కళాత్మక
విజ్ఞాన వివేకములను అందించేందుకు కృషి చేయడం !
 
(3) :
భక్తి యోగం :
భక్తి-ప్రధానంగా భారతీయ సనాతన జీవన విధానం,
ఆధ్యాత్మిక ( కర్మ, యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాది )
సాధనా మార్గాలపై అవగాహన పెంచేందుకు ప్రామాణిక
సంస్కృత-ఆంధ్ర గ్రంథాలను / గ్రంథ భాగాలను మూలం
గానీ తాత్పర్యంతో గానీ అందించేందుకు కృషి చేయడం !
 
(4) :
పరస్పర ప్రచోదనం :
పాఠకులందరూ చర్చా భాగస్వాములు, విమర్శకులు,
సంపాదకులు అయ్యేవిధంగా ప్రోత్సహించడం ! అచ్చు
వేసిన పుస్తకాలకైతే సంపాదకవర్గం వేరు, పాఠకవర్గం
వేరుగా ఉంటుంది; గ్రంథ విస్తర భీతి ఉంటుంది. మనకు
ఆ భయం లేదు. పాఠకులందరూ కూడ చేతనులే;
ఆలోచనలు స్పందనలు భావనాశక్తి గలవారే.
తమలోని నిక్షేపాలను నలుగురితో  పంచుకుందామనే
ఆకాంక్ష, ప్రయత్నశీలత ఉంటే చాలు !
 
ఆదిశంకరాచార్యులవారు శివస్తోత్రం ఒకవిధంగా చేస్తే,
భక్త కన్నప్ప ఇంకో విధంగా చేసి ఉంటాడు; ఇతర
జానపదులు వేరేవిధంగా చేసి ఉంటారు !
సహజత్వంతో కూడిన, వైవిధ్యభరితమైన
ఈ భావవినిమయం – ( Sharing of feelings,
reactions, discussions, debates, Gems of
Quotations and  Ideas – own or collected )
జరగడం ఎంతటి ఉత్తేజకరం !
తెలుగుభాషలో అయితే మరీనూ !
 
ప్రధానంగా ఈ అవకాశం కల్పించడానికే ఈ అనుబంధ
బ్లాగు ( this Sister-Blog ) అవతరించింది. దీనిలో
మనం అందరం ఉత్సాహంగా పాల్గొందామని
శుభసంకల్పం చేసుకుందాం !
 
NOTE:
 
Various Contents and Facilities
of this Blog are contained in the
Side – Bar. If the side-bar is not
visible on the right side of this page, please click on
the Title ” TELUGU BHAKTI ” at the
top of this page. Then in the side-bar
that appears, click on different items
in Categories ( వర్గములు ) to view the
related topics ( subject-wise ). If you
click on Archives ( ఖజానాలు ), you
can view the  posts in date order
in each month.
 

తెలుగులో తేలికగా టైప్ చేయడం ఎలా?

18/02/2010

మిత్రులారా !

Netizen లైన స్వరాష్ట్రాంధ్రులు, ఇతరరాష్ట్రాంధ్రులు(ప్రవాసాంధ్రులు), NRI ఆంధ్రులలో కంప్యూటరుపై తెలుగుభాష, తెలుగు లిపుల వాడకమును పెంచడం ఎలా? అన్న సమస్యకు సులభ పరిష్కారం : ఇలా చేయండి>

(1) One-time Installation of facility:

i open ” baraha.com “    
ii click ” download ” on left side.  
iii click ” download  Baraha Unicode 2.0 “” 
iv Save Baraha IME on Desk-Top.  
v Click on the above icon and run ” IME Set – up “.
vi Once this is set-up, you can see the icons 
  ” Baraha IME ” , and ” Baraha Pad ” on desk top ( where saved ).

(2) Steps for typing Telugu Script on 

normal key-board:

i click on the icon ” Baraha IME ” on desk top.
ii You will see at right hand bottom side ( on the Start menu line, right-side )
  the default  icon ” KN ” ( showing the default Language Kannada ); or “EN” meaning English.
iii  click on this . It opens a box.  
iv  click on ” Language ” in the box.
v click on ” Telugu ” in the new box that shows list of Indian Languages.
  The icon will appear as ” TE ” indicating Telugu Mode.
vi Now it is ready to type in Telugu.  
vii press ” F11″ key or “F12″ key of the key-board, to alternate 
  between Telugu Script and English Scripts.
(3) For familiarity of typing Telugu ” GUNIMTAM ” :
             
i For the rules of transliteration, click on ” TE ” or ” EN ” at the
  right bottom-side. Then on ” Help ” in the box.
  then , double-click on ” Transliteration – on ” Rules “, -
  then on the required Language ” Telugu “, for the rules of Typing.

 

తెలుగు అక్షరప్రపంచం మీ వ్రేలికొనలలో ( finger-tips )లో ఉన్నట్లే !

తెలుగు లిపికి చాలా వేగంగా దూరమవుతున్న ఈ తరం తెలుగు బాలబాలికలకు తెలుగు అక్షర వర్ణమాలతో పూర్తి పరిచయం కలిగించడం ఒక ఆట;

రోజుకి 2 నిమిషాల ఆట ! ఇలా :

పైన 3 లో చెప్పినట్లుగా, Help లోని Transliteration Ruleలోనుంచి, రొజూ  రెండు అక్షరాలను copy & paste చేసి, font-size enlarge చేసి, ఆ రెండు అక్షరాలనే వచ్చేదాకా గాలిలో వ్రేలితో practice చేయించవచ్చు . ఇలాచేస్తే, ఏవయస్సు వారికైనా,  other activities ( studies, etc.)కి disturbance లేకుండా, తెలుగు చడవడం వచ్చేస్తుంది.

తెలుగువారమని సగర్వంగా చెప్పుకునేందుకు ఇది ఒక ప్రధాన

అర్హత కాదంటారా !


Follow

Get every new post delivered to your Inbox.