| Sree Rama. | |||||||||
| తెలుగులో తేలికగా వ్రాయడం (కంప్యూటర్ లో) టైపు చేయడం ఎలా? | |||||||||
| SUGGESTIONS from | |||||||||
| ” kamthasthabharathi.wordpress.com “ | |||||||||
| for Promoting easy use of Indian Languages | |||||||||
| ( Telugu & Sanskrit / Hindi ) on Computers. | |||||||||
| STEPS to be able to TYPE in INDIAN LANGUAGES - | |||||||||
| especially TELUGU and SANSKRIT / HINDI. | |||||||||
| on the usual key-board. | |||||||||
| SAMPLE SCRIPTS : | |||||||||
| Telugu: | |||||||||
| శ్రీరామ జయ రామ జయ జయ రామ ! | |||||||||
| Sanskrit: | |||||||||
| श्रीराम जय राम जय जय राम ! | |||||||||
| English: | |||||||||
| SrIrAma jaya rAma jaya jaya rAma ! | |||||||||
| 1) | For enabling the Typing of Text in TELUGU, SANSKRIT | ||||||||
| (or any Indian Language) | |||||||||
| THE FOLLOWING IS ONE – TIME SET-UP. | |||||||||
| i | open ” baraha.com “ | ||||||||
| ii | click ” download ” on left side. | ||||||||
| iii | click ” download Baraha Unicode 3.1 “ | ||||||||
| iv | Save Baraha IME on Desk-Top. | ||||||||
| v | Click on the above icon and run ” IME Set – up “. | ||||||||
| vi | Once this is set-up, you can see the icons | ||||||||
| ” Baraha IME ” , and ” Baraha Pad ” on desk top. | |||||||||
| 2) | For typing Telugu, etc. whenever required. | ||||||||
| i | click on the icon ” Baraha IME ” on desk top. | ||||||||
| ii | You will see at right hand bottom side | ||||||||
| ( on the Start menu line, right-side ) | |||||||||
| the default icon ” KN “ | |||||||||
| ( showing the default Language Kannada ). | |||||||||
| iii | click on this . It opens a box. | ||||||||
| iv | click on ” Language ” in the box. | ||||||||
| v | click on ” Telugu ” in the new box that shows | ||||||||
| list of Indian Languages. | |||||||||
| The icon will appear as ” TE ” indicating | |||||||||
| Telugu Mode. | |||||||||
| vi | Now it is ready to type in Telugu. | ||||||||
| vii | press ” F11″ key or “F12″ key of the key-board, | ||||||||
| to alternate between Telugu Script | |||||||||
| and English Scripts any number of times. | |||||||||
| 3) | For familiarity of keying-in in Telugu etc. | ||||||||
| ( The SIMPLEST- EVER Method ) | |||||||||
| i | For the rules of transliteration, click on ” TE “ | ||||||||
| or ” EN ” at the right bottom-side. Then on | |||||||||
| ” Help ” in the box. Then , double-click on | |||||||||
| ” Transliteration Rules “, – then on the required | |||||||||
| Language ” Telugu “, for the rules of Typing. | |||||||||
| 4) | How to give the Text of , say, a Sloka, in all the | ||||||||
| three languages – Telugu, Sanskrit ( Hindi is same ), | |||||||||
| and English – for the benefit of readers. | |||||||||
| i | click on the icon “Baraha Pad” on the DeskTop. | ||||||||
| ii | click on “Language” - then, on “Telugu.” | ||||||||
| iii | Now type the Text according to Telugu | ||||||||
| Transliteration Rules. Telugu Script will appear | |||||||||
| on the Baraha Pad. | |||||||||
| iv | Select, copy and paste ( the text which is required | ||||||||
| to be converted ) , twice below the Telugu Text. | |||||||||
| v | Select the second Telugu Text – click on “Tools “ | ||||||||
| at the top – then on ” convert” – then on the language | |||||||||
| ” Devanagari ” ( for Sanskrit & Hindi same ) | |||||||||
| vi | Select the third Telugu Text – click on “Tools ” at the | ||||||||
| top – then on ” convert” – then on the language | |||||||||
| English . | |||||||||
| vii | Now, the first Sloka is in Telugu, the second is in | ||||||||
| Sanskrit / Hindi, and the third is in English ! | |||||||||
| viii | Most of the Indians on Earth can read this | ||||||||
| combination, pronouncingmost precisely | |||||||||
| and most meaningfully ! | |||||||||
| Let most of the”TELUGU BHAKTI.COM” GROUP MEMBERS | |||||||||
| enjoy typing in Telugu, and reading in Telugu the | |||||||||
| original Telugu and Sanskrit Texts most accurately | |||||||||
| ( without distortions ), express their meanings | |||||||||
| and summaries in Telugu freely, | |||||||||
| for maximum absorption of the Rasa & Spirit ! | |||||||||
| LET US show our BHAKTI to our TELUGU ! | |||||||||
| NOTE : | |||||||||
| In case of any difficulty at any stage, we shall be | |||||||||
| happy to clarify further, on your query at the box | |||||||||
| provided at the bottom of this post, or through | |||||||||
| e-mail to ” sreemaathaa@yahoo.com”. | |||||||||
| తెలుగువారు తెలుగువారితో చేసే విషయ ప్రసారాలలో | |||||||||
| (computer communications)లో తెలుగు లిపి యొక్క | |||||||||
| వాడకాన్ని ప్రోత్సహించడం కూడా మన ప్రధాన | |||||||||
| ఆశయాలలో ఒకటి కాబట్టి ! | |||||||||
‘తెలుగువారు’ టాగుతో ఉన్న టపాలు
How to type in Telugu Script?
10/06/2010శ్రీ ” వికృతి ” నామ సం. ఉగాదికి సుకృత సంకల్పాలు
15/03/2010తెలుగు బంధువులారా !
ఉగాది ( ౧౬-౦౩-౨౦౧౦ ) తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు !
ఈ శుభ సందర్భంలో ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ముఖ్యంగా తన పరిపూర్ణానుగ్రహాన్ని ఈ సంవత్సరమంతా వర్షించాలని ప్రార్థిస్తూన్నాను.
మన వంతు ప్రయత్నంగా, కొన్ని దృఢ నిర్ణయాలు చేసుకుందాము.
(౧) నిత్యమూ భగవంతుని భక్తిభావ కుసుమాలతో పూజిద్దాం.
(౨) రోజుకు ఒక సారైనా, ఆయన అనుగ్రహం తప్ప ఏమీ కోరని ప్రార్థన చేద్దాం.
(౩) రోజూ ” నేను భారతీయుడిని / భారతీయురాలిని “ ,అనీ, ” నాది తెలుగు కుటుంబం ” అనీ స్మరించుకుందాం.
(౪) భారతీయ సంస్కృతికి అనుగుణంగా, రోజూ ఒక్క భగవద్గీతా శ్లోకాన్ని అర్థంతో సహా పారాయణ చేద్దాం.
(౫) ” లోకాః సమస్తాః సుఖినో భవన్తు ” అనిరోజుకొక సారి ఆకాంక్శిద్దాం.
(౬) తెలుగుదనానికి ప్రతీకగా రోజూ ఏదో ఒక్క తెలుగు పద్యాన్ని పైకి చదివి, మన కుటుంబ సభ్యులకు వినబడేలా చేద్దాం.
(౭) తెలుగు లిపిలోనున్న ఏదో ఒక విషయం – పత్రికో, పుస్తకమో, బ్లాగో – ఏదో ఒకటి రెండు నిమిషాల పాటు అయినా చదవటం, చదివించటం అలవాటు చేసుకుందాం.
(౮) పై విషయాలను మన దినచర్యలో భాగం చేసుకుంటే, మనం భారతీయులమని, తెలుగువారమని గుండెలమీద చేయి వేసుకుని సగర్వంగా చెప్పగలం !
(౯) రోజూ చేయటానికి వీలుపడనంత వేగవంత జీవితం గడిపేవారు మాత్రం కనీసం వారానికోసారి పాటించినా చాలు. పై విషయాలను స్పృశించకుండా, ఏ వారమూ ( week – end ) కూడా గడిచి పోకూడదు !
శ్లో || ” ప్రకృతిః పఞ్చభూతాని గ్రహాలొకాః స్వరాస్తథా |
దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వన్తు మఙ్గళమ్ ||
భవదీయుడు,
భాగవతుల శ్రీనివాస రావు
(kamthasthabharathi.wordpress.com)
NOTE: Please click at the Title ” TELUGU BHAKTI ” at the top of this Post, to get a view of the side-bar. Then you can click on any page / subject you like.
తెలుగు వల్ల మనకేం లాభం ?
21/02/2010| తెలుగువారిలోని మేథావులారా ! |
| ” యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః ” అని గీతా వచనం. |
| మీరు ఆలోచించి, ఆచరణయోగ్యమని చేప్పిన విషయాలను, |
| ఆచరణలో పెట్టేందుకు స్వయంగా ప్రయత్నిస్తూ దారి చూపితే, |
| ఇతరులు అనుసరిస్తారు. |
| నేడు 21-02-2010 ” మాతృభాషా దినోత్సవం ” ! |
| మన తెలుగు జాతి ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది ! |
| తెలుగు సంస్కృతీ సాహిత్యాలంటే అసలు గౌరవమే లేని ; |
| తెలుగు సంస్కృతీ సాహిత్యాలతో అసలు పరిచయమే లేని; |
| తెలుగు పలుకులు మాట్లాడటమే ఇష్టం లేని, చేతకాని ; |
| తెలుగు అక్షరాలు వ్రాయడం, చదవడమే రానటువంటి ; |
| ” తెలుగు కుటుంబాలు “ వేగంగా పెరిగిపోతున్నాయి ! |
| ఎదుటివారు తెలుగువారే అయినాసరే, తెలుగు తప్ప |
| ఇంకేదయినా మాట్లాడే ” పరభాషా వ్యామోహం ” మన సొత్తు ! |
| ఎప్పుడైనా ఎక్కడైనా ఓ తెలుగు తేజం తళుకులీనితే, అప్పుడు |
| ” మనం కూడ తెలుగువారమే” అనే స్పృహ తెచ్చుకుంటూండే |
| నిద్రాణ జాతి మనది. |
| ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులందరూ చెబుతున్నదేమంటే - |
| ” మాతృభాషతో సాన్నిహిత్యం ఉన్నవారే ఏ భాషలోనైనా, |
| ఏ రంగంలోనైనా రాణించ గలరు ” అని ! దీనికి తార్కాణం - |
| టంగుటూరి ప్రకాశం పంతులుగారి వంటి స్వాతంత్ర్య కాలం నాటి |
| మన న్యాయవాదులు, రాజకీయవాదులే ! |
| దేశస్వాతంత్ర్యానంతరం గత 60 సంవత్సరాలలో, |
| మారుతున్న దేశ కాల పరిస్థితులకు స్పందనగా, ఇంగ్లీషుని |
| స్వంతం చేసుకునే ఆరాటంలో, అవసరం లేకపోయినా |
| తెలుగుకు దూరం అయ్యారు రెండు తరాల తెలుగువారు ! |
| ఈ మూడో తరానికైనా, మన ప్రధాన భాషా సంస్కృతీ స్రవంతితో |
| అనుబంధం పెంచకపోతే, పూడ్చలేని నష్టం కలిగించినవార మవుతాం . |
| మాతృ నౌకతో అనుబంధాన్నిచ్చే జీవనసూత్రం |
| ( Life – chord from Mother – Space Ship ) |
| తెగిపోయిన వ్యోమగామిలాగా అయిపోతుంది మన స్థితి ! |
| ఎవరినో ఉద్ధరించడం దాకా ఎందుకు ? ఈ పోటీ ప్రపంచంలో - |
| పరభాషా మాధ్యమంలో నేర్చుకున్న విద్యా విజ్ఞానాలవల్ల |
| యాంత్రికమైన ఆలోచనలు, యాంత్రికమైన ఉచ్చారణలు గల |
| నేటి పోటీ ప్రపంచంలో- మాతృభాషతో సాన్నిహిత్యంవల్ల ఏ కొంతయినా |
| పెరిగే మౌలిక, స్వీయ, సృజనాత్మక ఆలోచనలవల్ల - |
| ఏ రంగంలోనైనా ” సాటివారిలో మేటివారుగా ” గుర్తింపు తప్పనిసరి ! |
| ” మంచిది అని గుర్తిస్తే, మనం చేయలేకపోయినా, పిల్లలచేత చేయించవచ్చు ! “ |
| వరదలలో కొట్టుకు పోతున్నవారు ఏదో ఒక ఆధారంకోసం |
| ప్రయత్నించినట్లుగా, ఏటికి ఎదురీదినట్లుగా, మనం ప్రయత్నం |
| ఆరంభించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాదు కాదు; తరుణం మించిపోతోంది ! |
| ఎవరికి వారు తమ కుటూంబంలొని ప్రస్తుత పరిస్థితిని |
| ఒక్క వీసమైనా మెరుగు పర్చేందుకు తాముగా చేయదగ్గ , |
| చేయదల్చుకున్న ఒక్క పనినైనా, ఈ టపాకు వ్యాఖ్య రూపంలో |
| అందిస్తే, అది ఇతరులకు ప్రోత్సాహకరంగానూ, మార్గదర్శకంగానూ |
| ఉంటుందనే సూచనను ఆర్తితో చేస్తున్నాను. |
| భవదీయుడు, |
| భాగవతుల శ్రీనివాస రావు
(తెలుగు భారతి . వర్డ్ ప్రెస్.కామ్ వారి సౌజన్యంతో ) ( courtesy : telugubharathi.wordpress.com ) |
| E-Mail : sreemaathaa@yahoo.com |
| Blog : kamthasthabharathi.wordpress.com |
ABOUT US ..( ఈ బ్లాగు గురించి .. )
20/02/2010| శ్రీరామ |
| ABOUT US ..( ఈ బ్లాగు గురించి .. ) |
| ఇది తెలుగువారికి సుపరిచితమైన |
| telugubhakti.com యొక్క అనుబంధ బ్లాగు. |
| ( Sister – Blog ). |
| మన ప్రధాన లక్ష్యాలు నాలుగు : |
| (1): |
| తెలుగు భాషకు సేవ : |
| ఎక్కువ శాతం తెలుగువారు ఎక్కువ పరిమాణంలో |
| మాతృభాషను ఉపయోగిస్తూ, అమ్మ ఒడిలోని కమ్మ |
| దనాన్ని జీవితాంతమూ ఆస్వాదించేందుకు దోహదం |
| చేయడం ద్వారా మాతృభాషా పునరుజ్జీవనమునకై |
| కృషి చేయడం ! |
| (2) : |
| తెలుగు వారికి సేవ : |
| తెలుగువారు ఎక్కడ ఉన్నా, వారికి, వారి కుటుంబాలకు |
| తరతరాలా తెలుగుదనంతో అనుబంధం దృఢతరం |
| చేసేటట్లుగా, తెలుగు సంస్కృతీ సాహిత్య కళాత్మక |
| విజ్ఞాన వివేకములను అందించేందుకు కృషి చేయడం ! |
| (3) : |
| భక్తి యోగం : |
| భక్తి-ప్రధానంగా భారతీయ సనాతన జీవన విధానం, |
| ఆధ్యాత్మిక ( కర్మ, యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాది ) |
| సాధనా మార్గాలపై అవగాహన పెంచేందుకు ప్రామాణిక |
| సంస్కృత-ఆంధ్ర గ్రంథాలను / గ్రంథ భాగాలను మూలం |
| గానీ తాత్పర్యంతో గానీ అందించేందుకు కృషి చేయడం ! |
| (4) : |
| పరస్పర ప్రచోదనం : |
| పాఠకులందరూ చర్చా భాగస్వాములు, విమర్శకులు, |
| సంపాదకులు అయ్యేవిధంగా ప్రోత్సహించడం ! అచ్చు |
| వేసిన పుస్తకాలకైతే సంపాదకవర్గం వేరు, పాఠకవర్గం |
| వేరుగా ఉంటుంది; గ్రంథ విస్తర భీతి ఉంటుంది. మనకు |
| ఆ భయం లేదు. పాఠకులందరూ కూడ చేతనులే; |
| ఆలోచనలు స్పందనలు భావనాశక్తి గలవారే. |
| తమలోని నిక్షేపాలను నలుగురితో పంచుకుందామనే |
| ఆకాంక్ష, ప్రయత్నశీలత ఉంటే చాలు ! |
| ఆదిశంకరాచార్యులవారు శివస్తోత్రం ఒకవిధంగా చేస్తే, |
| భక్త కన్నప్ప ఇంకో విధంగా చేసి ఉంటాడు; ఇతర |
| జానపదులు వేరేవిధంగా చేసి ఉంటారు ! |
| సహజత్వంతో కూడిన, వైవిధ్యభరితమైన |
| ఈ భావవినిమయం – ( Sharing of feelings, |
| reactions, discussions, debates, Gems of |
| Quotations and Ideas – own or collected ) |
| జరగడం ఎంతటి ఉత్తేజకరం ! |
| తెలుగుభాషలో అయితే మరీనూ ! |
| ప్రధానంగా ఈ అవకాశం కల్పించడానికే ఈ అనుబంధ |
| బ్లాగు ( this Sister-Blog ) అవతరించింది. దీనిలో |
| మనం అందరం ఉత్సాహంగా పాల్గొందామని |
| శుభసంకల్పం చేసుకుందాం ! |
| NOTE: |
| Various Contents and Facilities |
| of this Blog are contained in the |
| Side – Bar. If the side-bar is not |
| visible on the right side of this page, please click on |
| the Title ” TELUGU BHAKTI ” at the |
| top of this page. Then in the side-bar |
| that appears, click on different items |
| in Categories ( వర్గములు ) to view the |
| related topics ( subject-wise ). If you |
| click on Archives ( ఖజానాలు ), you |
| can view the posts in date order |
| in each month. |