| శ్రీరామ |
| ABOUT US ..( ఈ బ్లాగు గురించి .. ) |
| ఇది తెలుగువారికి సుపరిచితమైన |
| telugubhakti.com యొక్క అనుబంధ బ్లాగు. |
| ( Sister – Blog ). |
| మన ప్రధాన లక్ష్యాలు నాలుగు : |
| (1): |
| తెలుగు భాషకు సేవ : |
| ఎక్కువ శాతం తెలుగువారు ఎక్కువ పరిమాణంలో |
| మాతృభాషను ఉపయోగిస్తూ, అమ్మ ఒడిలోని కమ్మ |
| దనాన్ని జీవితాంతమూ ఆస్వాదించేందుకు దోహదం |
| చేయడం ద్వారా మాతృభాషా పునరుజ్జీవనమునకై |
| కృషి చేయడం ! |
| (2) : |
| తెలుగు వారికి సేవ : |
| తెలుగువారు ఎక్కడ ఉన్నా, వారికి, వారి కుటుంబాలకు |
| తరతరాలా తెలుగుదనంతో అనుబంధం దృఢతరం |
| చేసేటట్లుగా, తెలుగు సంస్కృతీ సాహిత్య కళాత్మక |
| విజ్ఞాన వివేకములను అందించేందుకు కృషి చేయడం ! |
| (3) : |
| భక్తి యోగం : |
| భక్తి-ప్రధానంగా భారతీయ సనాతన జీవన విధానం, |
| ఆధ్యాత్మిక ( కర్మ, యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాది ) |
| సాధనా మార్గాలపై అవగాహన పెంచేందుకు ప్రామాణిక |
| సంస్కృత-ఆంధ్ర గ్రంథాలను / గ్రంథ భాగాలను మూలం |
| గానీ తాత్పర్యంతో గానీ అందించేందుకు కృషి చేయడం ! |
| (4) : |
| పరస్పర ప్రచోదనం : |
| పాఠకులందరూ చర్చా భాగస్వాములు, విమర్శకులు, |
| సంపాదకులు అయ్యేవిధంగా ప్రోత్సహించడం ! అచ్చు |
| వేసిన పుస్తకాలకైతే సంపాదకవర్గం వేరు, పాఠకవర్గం |
| వేరుగా ఉంటుంది; గ్రంథ విస్తర భీతి ఉంటుంది. మనకు |
| ఆ భయం లేదు. పాఠకులందరూ కూడ చేతనులే; |
| ఆలోచనలు స్పందనలు భావనాశక్తి గలవారే. |
| తమలోని నిక్షేపాలను నలుగురితో పంచుకుందామనే |
| ఆకాంక్ష, ప్రయత్నశీలత ఉంటే చాలు ! |
| ఆదిశంకరాచార్యులవారు శివస్తోత్రం ఒకవిధంగా చేస్తే, |
| భక్త కన్నప్ప ఇంకో విధంగా చేసి ఉంటాడు; ఇతర |
| జానపదులు వేరేవిధంగా చేసి ఉంటారు ! |
| సహజత్వంతో కూడిన, వైవిధ్యభరితమైన |
| ఈ భావవినిమయం – ( Sharing of feelings, |
| reactions, discussions, debates, Gems of |
| Quotations and Ideas – own or collected ) |
| జరగడం ఎంతటి ఉత్తేజకరం ! |
| తెలుగుభాషలో అయితే మరీనూ ! |
| ప్రధానంగా ఈ అవకాశం కల్పించడానికే ఈ అనుబంధ |
| బ్లాగు ( this Sister-Blog ) అవతరించింది. దీనిలో |
| మనం అందరం ఉత్సాహంగా పాల్గొందామని |
| శుభసంకల్పం చేసుకుందాం ! |
| NOTE: |
| Various Contents and Facilities |
| of this Blog are contained in the |
| Side – Bar. If the side-bar is not |
| visible on the right side of this page, please click on |
| the Title ” TELUGU BHAKTI ” at the |
| top of this page. Then in the side-bar |
| that appears, click on different items |
| in Categories ( వర్గములు ) to view the |
| related topics ( subject-wise ). If you |
| click on Archives ( ఖజానాలు ), you |
| can view the posts in date order |
| in each month. |
‘About this Blog’ అనే వర్గంలోని టపాలు
ABOUT US ..( ఈ బ్లాగు గురించి .. )
20/02/2010స్వాగతం, సుస్వాగతమ్
17/02/2010ఆత్మీయులైన భారతీయాంధ్ర బంధువులారా !
స్వాగతం ! సుప్రసిద్ధమైన మన ” తెలుగు భక్తి పేజెస్ “
web-site యొక్క ప్రేక్షక, శ్రోతృ వర్గానికి సుస్వాగతం !
TBP కి ఇది అనుబంధ బ్లాగు ( Sister – Blog ). అమూల్య విషయ సేకరణ, ప్రసారాలకు TBP అవిరళ కృషి చేస్తూంటే, వాటిని చదివినపుడు తమకు కలిగే ఆలోచనలు, స్పందనలు, అనుభూతులను పంచుకునే అవకాశం అందరికీ అందించాలనే తపనతో జరిగినదే ఈ బ్లాగుయొక్క ఆవిర్భావం.
ప్రతీ POST క్రింద, ” leave a comment ” మీద క్లిక్ చేస్తే తెరుచుకునే Comments box లో type చెయ్యడం ద్వారా మీ మీ అభిప్రాయాలను అందరితో పంచుకోవచ్చు. ప్రయోజనకరమైన అంశాలపై discussion – chains, constructive criticisms, అభిప్రాయ వేదికలు, చర్చా పరంపరలు, ..ఎన్నెన్నో చేసుకోవచ్చు.
ముఖ్యమైన అంశాలు రెండే -
(౧) ఒక పేజీ / పోష్టును చదివాక దానిపై మనకు కలిగిన ఆలోచనను frankగా, naturalగా మనదైన భాషలో వ్యక్తీకరించడమే.
(౨) తెలుగు ( మన మాతృభాష ) లో వ్యక్తీకరించిన భావాలు సహజంగా, మనోహరంగా ఉంటాయి కదా. Englishలో type చేసినంత సులభంగా, అనాయాసంగా, మన మామూలు key-board మీదనే తెలుగు భాషని తైపు చెయ్యడం ఎలాగో, తెలియనివారికి తెలియజేయదం మన పవిత్ర బాధ్యత ! అది తరువాతి పోష్టులలో వివరిస్తాము.
ఈ బ్లాగులో ప్రచురణకు periodicity, frequency ల నియమమేదీ లేదు కాబట్టి, రొజూ ఒకసారి latest posts ఏమన్నా వచ్చాయేమో చూసుకోవడం ఒక విజ్ఞానదాయకమైన సత్కాలక్షేపం, సదాచారం అవుతుంది.
మీ ఆశీస్సులను, శుభాకాంక్షలను, సహకారాన్ని, భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ,
తెలుగు భక్తి పేజెస్ గ్రూప్ నిర్వాహక, సభ్య బృందం.
Hello world!
17/02/2010Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!