‘హిందువుల ఆచార వ్యవహరములు’ అనే వర్గంలోని టపాలు

తీర్థయాత్రలు: (అత్యధిక ప్రయోజనం పొందటం ఎలా?)

28/06/2010
 
తీర్థయాత్రలు: (అత్యధిక ప్రయోజనం పొందటం ఎలా?)
 
 
సామాజిక రంగంలో ఉద్యోగమేళాలు, ఋణమేళాలు, 
ఆరోగ్యమేళాలు, మొ. ఎన్నో రకాల మేళాలు (Fairs) సందడిగా
నిర్వహించ బడుతుంటాయి గదా. 
 
వాటివల్ల వ్యక్తిగతంగా లబ్ధి పొందినప్పుడే గదా 
వాటిలో పాల్గొనటం వల్ల ప్రయోజనం ! లేకపోతే 
మనం చూసే అనేక తమాషాలలో అవీ కొన్ని అవుతాయి.
 
ఆ మేళాకు వెళ్ళిరావటం వలన, మనకు ఉద్యోగమో, ఋణమో
రాకపోయినప్పటికీ, కనీసం ఏయే అర్హతలు, ఏయే పత్రాలు
సిద్ధం చేసుకుంటే, భవిష్యత్తులోనైనా మనకు వాటిని పొందే 
అవకాశం పెరుగుతుందో తెలియవస్తుంది. కనీసం ఆ ప్రయోజనం 
దక్కించుకున్నా కూడా, వారు వివేకుల క్రిందే లెక్క !
 
ఆ మేళాల ( Fairs ) లో పాల్గొనకుండా కూడా, అంతకంటే
ఎక్కువ ( ఆరోగ్యాది ) లాభాలను పొందవచ్చు 
 
ఆధ్యాత్మిక రంగంలో – కుంభమేళాలు, తిరునాళ్ళు, 
తీర్థయాత్రలు మొ. కూడా అంతే గదా ! 
 
వాటివల్ల వ్యక్తిగతంగా మనం (ఆధ్యాత్మిక) లబ్ధి పొందితేనే గదా
వాటిలో పాల్గొనటంవల్ల ప్రయోజనం ! లేకపోతే, ఆయా 
నదులలో ఈదే చేపలకన్న, ఆయా క్షేత్రాలలో ఎగిరే పక్షులకంటే 
ఏ విధంగా మనం ఉన్నతులం? వ్యయ ప్రయాసలకోర్చ
అందిపుచ్చుకున్న సువర్ణావకాశాన్ని జారవిడుచుకున్న
అవివేకులం కాదా?
 
ఆ తిరునాళ్ళు మొ. వాటిలో పాల్గొనకుండా కూడా
అంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక ఉన్నతి సాధించే వీలు
ఉన్నది గదా !
 
కాబట్టి చెప్పవచ్చినదేమంటే – తీర్థయాత్రలు, మొ. మానమని
కాదు; మన ఇష్ట దైవానికి సంబంధించిన ఏదైనా ఒకటో రెండో
సిద్ధక్షేత్రాలను అప్పుడప్పుడు దర్శించి, ఆ దైవంతో అనుసంధానం
పెంచుకోవటం కోసమే చెయ్యాలి. మహా పురుషుల చరిత్రలను
పరిశీలిస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్క దైవానికి, ఒక్కొక్క క్షేత్రానికి 
అంకితమయ్యారని, అలా అవటం వల్లనే ప్రసిద్ధి, సిద్ధి పొందారనీ 
అనిపిస్తుంది. 
 
మోక్షసాధన వరకు ఉపయోగపడగలది యోగం. కాని, ఆధునిక 
పద్ధతులలో యోగా చేయటం ద్వారా, మనకి 
just breathing – exercises యొక్క ఫలం మాత్రమే
దక్కుతోంది !
 
అలాగే, మోక్షసాధన వరకు ఉపయోగపడగల ” తీర్థాటనము”ను
ఆధునిక పద్ధతులలో చేయటం వలన, just Tourism యొక్క
ఫలం మాత్రమే వచ్చే దక్కుతోంది గదా !
 
భౌతికంగా పెరిగిన ప్రయాణాది సౌకర్యాలను వాడుకోవద్దని కాదు;
మన మానసిక శక్తులను – వింతలు, విశేషాలు, మొ. అనవసర
విషయ బాహుళ్యం మీదికి చేదిరిపోనీయకుండా -
భగవంతునితో మానసిక అనుబంధాన్ని దృఢపరచుకునే
దృక్పథంతోనే తీర్థయాత్రలను చేస్తే, ఎంత అద్భుత ఫలితం !
 
పల్లెటూళ్ళో ఉన్న తాతగారు, బామ్మలు – తమను చూడటానికి 
ఏ అమెరికానుంచో వచ్చిన మనుమలూ, మనుమరాళ్ళూ -
తమకోసం తెచ్చినవి చూసి మాత్రమే సంతోషిస్తారా?
వారికి తమపట్ల ఉన్న అభిమానం, ఆత్మీయత, శ్రద్ధాభక్తులు,
మొ. వాటిని చూసి, అంతకన్న ఎక్కువ సంతోషించరా ?
భౌతిక విషయ ప్రపంచంలో వారు ఎంత పైకెదిగినా,
తాము చూపిన సంప్రదాయ మార్గాన్ని వదిలిపెట్ట లేదుకదా?
విలువలకు కట్టుబడి ఉంటున్నారు కదా? మొ. విషయాలు
వారికి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయా, ఇవ్వవా?
 
అవియే భగవంతుడు మననుంచి కోరుకునేది !
 

మనము ప్రదక్షిణ సవ్యముగానే ఎందుకు చేస్తాము!

06/06/2010

మనము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేముడు ఎప్పుడూ మన కుడివైపు
ఉంటాడు. మనదేశంలో కుడివైపు శుభకరము. మనము గర్భగుడి
చుట్టూ తిరుగుతున్నప్పుడు మంగళకరమైన,శుభప్రదమైన జీవితమును
గడుపుటను, జ్ఞాపకము చెసుకుంటాము. దేవుడు మనకు శక్తిని ఇచ్చి,
సహాయము చేసే మూల కారణముగా గుర్తుంచుకుంటాము.

“మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ”
మనదేశంలో తల్లితండ్రులను గురువులను దెవుడిగా భావిస్తాము.
ఇది మనస్సులో ఉంచుకుని తల్లితండ్రులకు గురువులకు గూడా
ప్రదక్షిణ చేస్తాము.

దెవుడి పూజ చేసిన తర్వాత మనచుట్టూ మనము ప్రదక్షిణ చేస్తాము.
ఈవిధముగా మనలో వున్న దేవత్వమును బాహ్య దేవుడిని
పూజించినట్లు గుర్తించుతాము.

పాశ్చాత్య దేశాలకు భిన్నంగా, మన రోడ్ల ట్రాఫిక్ పద్ధతి
ఎడమవైపు నుండి ( ప్రదక్షిణ మార్గంగా ) వెళ్ళేటట్లుగానే
వ్యవస్థీకరించ బడింది !

దేవాలయమునకు, దైవ ప్రతిమలకు, పూజ్యులకు, పెద్దవారికి,
గోవులకు అశ్వత్థాది పవిత్ర వృక్షములకు ..ప్రదక్షిణమార్గంలోనుంచి
వెళ్ళడమే మన భారతీయ సంస్కృతి !

మనము దీపము ఎందుకు వెలిగిస్తాము

14/05/2010
దీపంజ్యొతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప ! నమో2స్తుతే ||
మనము దేవుడి ముందర దీపము ప్రొద్దున,సాయంకాలము,
రెండు పూటలా కూడా దీపమువెలిగిస్తాము. కొంతమంది
అఖండ దీపము కూడా వెలిగిస్తారు.
వెలుతురు చీకటిని తొలగించునట్లు జ్ఞానము అవివేకమును
తొలగించును.
చమురు దీపము నకు ఒక ప్రత్యేకత ఉంది.చమురు గాని,నెయ్యి గాని
మన వాసనలని తెలియపరుస్తుంది.వత్తి మన అహాన్ని
తెలియపరుస్తుంది.జ్ఞానదృష్టి వెలిగించగానే వాసనలన్నీతొలగిపోయి
అహమంతయూ నశించును.దీపపు మంట పైకి చూచునట్లుగానే
మనము   ఎత్తైన ఆదర్శములకు  చేర్చే జ్ఞానమును సంపాదించవలెను.

Follow

Get every new post delivered to your Inbox.