| |
|
| |
భగవద్గీతలో ” భగవత్తత్త్వం ” గురించి. |
| |
|
| |
కృష్ణం వన్దే జగద్గురుమ్. |
| |
|
| |
పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు, శిష్యోత్తముడైన అర్జునునికి, |
| |
నిజతత్త్వమును ఉపదేశించుచూ పలికిన పలుకులు: |
| |
జగద్గురు వేదవ్యాస మహర్షి కృపవలన మనకు అందినవి: |
| |
|
| |
శ్రీ భగవానువాచ : |
| |
|
| శ్లో|| |
( 9 – 18 ) |
| |
|
| |
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ | |
| |
|
| |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ || |
| |
|
| |
|
| |
|
| ప్రభవః = |
| |
ఈ జగత్తు యొక్క సృష్టికి అనగా అవ్యక్తం నుండి వ్యక్తం అగుటకు, |
| స్థానం = |
| |
స్థితికి అనగా వ్యక్తరూపములో నుండుటకు, |
| ప్రళయః = |
| |
లయమునకు అనగా వ్యక్తం నుండి మరలా అవ్యక్తంలో |
| |
చేరిపోవుటకు, మూలకారణం నేనే ! |
| అవ్యయం = |
| |
ఈ సృష్టి – స్థితి – లయములనేవి నిరంతర చక్రభ్రమణంలో నుండుట |
| |
వలన, ఈ మూడూ వ్యయమయ్యేవే. |
| |
వ్యయము, తరుగుదల, నాశనము లేనట్టి, అందుచే శాశ్వతమైనట్టి |
| బీజం = |
| |
విత్తనం అనగా మూలకారణం నేనే ! |
| నివాసః = |
| |
నేను ఈ జగత్తుకు నివాస స్థానమును. అనగా ఈ చరాచర |
| |
జగత్తు అంతా – కాలతః, దేశతః అనంత వ్యాపకత్వం గల - |
| |
నాయందే ఉంటున్నది. ఎలా అయితే సకల పదార్థాములూ |
| |
ఆకాశంలోనే ఉంటూన్నాయో, అలాగే ! |
| సాక్షీ = |
| |
అందువలననే, భావాభావములకు, కృతాకృతములకు నేనే సర్వసాక్షిని! |
| |
చేసిన కర్మలకు, చేయక విడచిన కర్మలకుకూడ చిత్ర,గుప్త సాక్షిని నేనే! |
| |
చేయకూడనివి చేసినా, చేయవలసినవి మానినా కూడ |
| |
ఆయా కర్మాకర్మల ఫలప్రదాతను నేనే ! |
| నిధానం = |
| |
సంబారములుంచు చోటు, అనగా సకల ప్రాణులు భవిష్యత్తులో |
| |
అనుభవించుటకు వలయు సామగ్రి నిలువ యుండు చోటును నేనే ! |
| గతి: = |
| |
కర్మలయొక్క ఫలమును నేనే ! అందరికీ, అన్నిటికీ గమ్యము, |
| |
గమనము, గతి, దిక్కు నేనే ! సంకోచ వ్యాకోచములు నేనే ! |
| |
నానుండి బయటకు వచ్చిన జగత్తు, మరలా నాలోనికే |
| |
ప్రయాణిస్తోంది – హృదయ స్పందన వలె ; |
| |
స్థితిస్థాపక శక్తి ( ఎలాస్టిసిటీ )గల దారమునకు కట్టి విసిరిన బంతి వలె! |
| |
ఈ విభిన్న సాధనలూ, సంప్రదాయాలన్నీ కూడా. ఈ ప్రయాణం |
| |
ఆనందకరంగా, ఆటుపోట్లు లేకుండా, శీఘ్రంగా గమ్యం చేరుకోవడానికే! |
| |
అఖండ శాశ్వత ఆనంద స్థితిని పొందడానికే ! |
| |
గమ్యం శ్రీశైల పర్వత శిఖరం అయితే, సాధకులందరూ |
| |
ఒకే గమ్యాన్ని చేరుకునేందుకై, వివిధ మార్గాలలో, వివిధ స్థాయిలలో |
| |
ప్రయాణిస్తూ ఉన్నవారు. ఈవేళ వీరున్న చోటికి రేపు వారు రావచ్చు! |
| |
చిత్రం ఏమంటే, ” చుట్టుప్రక్కల ఉన్న వింతలూ, వినోదాలూ |
| |
అన్నీ చూసుకుంటూ నిదానంగావెళ్ళవచ్చులే “ |
| |
అనుకునేవారు కొందరు ;” గమ్యం అంత సులభంగా అందేది కాదు, |
| |
ఎందుకొచ్చిన శ్రమ ! ” అనుకుంటూ తిరోగమించేవారు మరికొందరు ! |
| |
గురుస్థాన యోగ్యత ఇంకా రాకపోయినా, ఉన్నత కక్ష్య లోని విద్యార్థులు |
| |
క్రింది కక్ష్య లోనివారికి మార్గదర్శనం చేస్తూ, సాధక – బాధకాలను |
| |
వివరిస్తూ సరియైన మార్గంలో ముందుకు సాగేందుకు తోడ్పడడంలో |
| |
తప్పు లేదు. అలాగే, సాధకులు కూడ, తమకు అందిన సూచనలు |
| |
శాస్త్రీయమైనవా కావా, తమస్థాయికి అనుకూలమా కావా |
| |
అనే ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ఈ రోజులలో అత్యవసరం. |
| |
దీనికోసం, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రామాణిక ( వ్యాసాది ప్రోక్త ) |
| |
గ్రంథ శ్రవణం, పఠనం, మననం చాలా సహాయకరం ! |
| భర్తా = |
| |
పోషించువాడను, రక్షించువాడను, భరించువాడను నేనే ! వారి వారి |
| |
అభ్యుదయ నిఃశ్రేయసముల కొరకై – అనునయించువాడను, |
| |
ప్రచోదన చేయువాడను, నిర్ణయించువాడను నేనే ! |
| ప్రభుః = |
| |
స్వామిని, ప్రభువును, శాసించువాడను నేనే ! అవసరమైనచో |
| |
పరివర్తనము తెచ్చుటకై న్యాయబద్ధముగా శిక్షించువాడను కూడ నేనే! |
| సుహృత్ = |
| |
అందరికీ, ఎవరికి వారికే నిజమైన మిత్రుడను నేనే ! |
| |
ప్రత్యుపకారాపేక్ష లేకనే, అవ్యాజమైన ప్రేమతో, అడగకనే హితము, |
| |
ఉపకారము చేయువారే నిజమైన మిత్రులు; |
| |
” సుహృత్ ” శబ్ద వాచ్యులు. పరస్పరం భోజనభాజనాదులు, |
| |
నిష్కారణ సందర్శనములు, మానసిక భావ విచార వినిమయములు, |
| |
రహస్య గోపనం లేకుండుటలు, సమస్యా పరిష్కార ప్రయత్నములు, |
| |
మున్నగున.వి మిత్ర లక్షణములు ! |
| |
మిత్ర సమాగమం ఉన్నప్పుడే కదా మిత్రులవల్ల ప్రయోజనం కలిగేది ! |
| శరణం = |
| |
ఆర్తితో ప్రార్థించు భక్తుల ఆర్తిని హరించువాడను, శరణ్యుడను నేనే ! |
| |
|
| |
******************************************* |
| |
|